Actor Harsha vardhan: రెండు రకాల సిచ్యువేషన్స్‌లో తాను సుసైడ్ చేసుకుందామనుకున్నానని సినీ నటుడు హర్ష వర్థన్ అన్నారు. అందులో ఒకటేమిటంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ మీద ఒక బుక్ చదివి ఓ పని చేసి, తాను మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో మనసంతా కకావికలం అయిపోయిందని, హ్యూమన్ సైకలాజీ ఇలా ఉంటుందా అని తాను ఫీలయ్యానని ఆయన చెప్పారు. దాని వల్ల చాలా డిస్టర్బ్ అవడంతో తనకు నిద్ర సరిగ్గా పట్టకపోయేసరికి, తాను కెమికల్ సపోర్ట్ తీసుకుందామని ఓ మెడికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లానని ఆయన అన్నారు.
ఇక ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లగానే, అసలు తాను ఎందుకు అక్కడికి వచ్చానో తెలుసుకోకుండా ఏవేవో మాట్లాడి కొన్ని ట్యాబెట్లు ఇచ్చారని హర్ష వర్థన్ తెలిపారు. ఆ ట్యాబెట్లు వేసుకోవడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి డిప్రెషన్ స్టార్టయ్యిందని, ఏదో మూడ్‌లోకి వెళ్లేవాడినని ఆయన చెప్పారు. ఒకానొక సమయంలో సుసైడ్ చేసుకోవాలనే స్టేజ్‌కి తాను వచ్చానని ఆయన తెలిపారు. అదే విషయాన్ని ఓ ఫ్రెండ్‌తో చెప్తే, వాడు దానికి వీటికి కామన్ డ్రగ్స్ ఉంటాయి. దాని వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తాయి. వాటిని మానేయ్ అని చెప్పినట్టు ఆయన తెలిపారు. అదేంటీ తనకు ప్రాబ్లమ్ ఉందని అవి ఇచ్చారు కదా.. దాని వల్ల ఇలా అవుతుందా, ఇది ఎలా తెలుస్తుంది అని ఆయన అనుకున్నట్టు ఆయన చెప్పారు.
ఇకపోతే పెయిన్ అనే దానికి ఎవరైనా భయపడాల్సిందేనని, భయపడతారని కూడా అని, 80% వరకు మనం తెచ్చుకున్న సమస్యలే ఉంటాయని, మిగతా 20% సహజంగా వస్తాయని హర్ష వర్థన్ అన్నారు. కాబట్టి ఎవరికైనా భయం ఉండాలని ఆయన చెప్పారు. కాబట్టి సుసైడ్ అన్నదానికి పెద్ద కారణాలేమీ ఉండవని, చిన్న చిన్న కారణాలే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.