స్టార్ హీరో బాలకృష్ణ గత కొన్నేళ్లుగా తనకు నచ్చిన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. గత పదేళ్లలో బాలయ్యకు పలు సినిమాలు హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. శ్రీరామరాజ్యం, లెజెండ్, గౌతమీపుత్ర శాతకర్ణి, అఖండ సినిమాలతో విజయాలను అందుకున్న బాలయ్య ప్రస్తుతం ప్రతిభ ఉన్న దర్శకుడు అయిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తున్నారు.
అయితే చాలా సంవత్సరాల క్రితం బాలయ్య ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పులు జరపగా ఆ ఘటన గురించి మీడియాలో జోరుగా చర్చ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన తర్వాత రోజున బాలయ్య సెక్యూరిటీ గార్డ్ ఒకరు చనిపోయారు. చాలా సంవత్సరాల క్రితం నిమ్స్ ఆస్పత్రి వైద్యుడు కాకర్ల సుబ్బారావు ఈ ఘటన గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
కాల్పులు జరిగిన సమయంలో తనకు మనస్సులో బాలయ్యను కాపాడాలని ఉండేదని ఇద్దరు పెద్ద సైకియాట్రిస్ట్ లు బాలయ్యను చూసి బాలయ్య జరపకపోతే తనకు తానుగా ఆత్మహత్య చేసుకునేవాడని చెప్పారని కాకర్ల సుబ్బారావు చెప్పుకొచ్చారు. తాను బాలయ్యకు సహాయం చేసినా బాలయ్య నుంచి తనకు ఎటువంటి సహాయం అందలేదని అయన కామెంట్లు చేయడం గమనార్హం.
బాలయ్య, బెల్లంకొండ సురేష్ మధ్య మాటామాట పెరగడం వల్లే ఆయన కాల్పులు జరిపారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తర్వాత రోజుల్లో బాలయ్య కానీ బెల్లంకొండ సురేష్ కానీ ఈ వార్తల గురించి స్పందించడానికి ఇష్టపడలేదు. బాలయ్య హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే.