Actor Harsha vardhan: తాను రైటర్‌ను అయ్యింది ఒక ఛాలెంజ్ మీదనే అని ప్రముఖ నటుడు హర్ష వర్థన్ అన్నారు. తాను ఓ డైరెక్టర్‌తో మాట్లాడుతున్నపుడు ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన సీన్ ఒకటి జరుగుతుందని, అది చూసి అక్కడే ఉన్న డైరెక్టర్‌తో ఎక్కడైనా అమ్మాయిలు ఇలా మాట్లాడుకుంటారా అని నవ్వుతూ అన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. కానీ నిజం ఏమిటంటే ఆ డైలాగ్స్ రాసింది ఆ డైరెక్టరేనని తనకు తెలియక ఆమెతోనే అన్నట్టు ఆయన తెలిపారు. అప్పుడు ఆమె ఏంటీ.. అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారో మీకు తెలుసా అని అడిగితే, తనకు అమ్మాయిలతో సత్సంబంధాలు చాలా ఎక్కువని, అంతే కాకుండా తమ ఇంట్లో కూడా ఎక్కువ మంది కజిన్స్ అమ్మాయిలేనని చెప్పినట్టు ఆయన అన్నారు. అయితే గర్ల్స్, గర్ల్స్ మధ్య ఎలా ఉంటది మరి అని తనను ఆ డైరెక్టర్ అని అడిగారని, అప్పుడే తనకు పక్కనున్న ఎవరో చెప్పేసరికి అప్పుడు తనకు అసలు విషయం అర్థమైందని ఆయన చెప్పారు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని ఆమె అనగానే లేదండీ సారీ, తాను ఊరికే అనేశానని, మీరు రైటర్ అని తెలియక అంటే.. దానికి ఆమె రైటర్ అని తెలియకపోతే అనేస్తావా అని అన్నారని హర్ష తెలిపారు.
ఆ తర్వాత సరే అయితే ఆ సీన్ మీరైతే ఎలా రాస్తారో చూపించండి అన్నప్పుడు అక్కడే కూర్చొని రాసి ఇచ్చానని, దాంతో ఆ లేడీ డైరెక్టర్ చాలా ఆశ్చర్యపోయారని ఆయన చెప్పారు. అలా తాను రైటర్‌గా మారిపోయానని ఆయన స్పష్టం చేశారు. యాక్టింగ్ కూడా అలాగే సక్సెస్ అయిందని హర్ష అన్నారు. తాను మ్యూజిక్ ట్రయల్స్ చేసేటప్పుడు తన ఫ్రెండ్ ఆశీర్వాద్ అనే తన సీనియర్‌తో స్టూడియోల చుట్టూ తిరిగేవాడినని ఆయన చెప్పారు. ఆయన దగ్గర మ్యూజిక్ నేర్చుకోవడానికి చేరానని, కానీ ఆ తర్వాత ఆయనకు అవకాశాలు రావడంతో ఆయన దగ్గరే పనిలోకి చేరానని ఆయన అన్నారు. కానీ తన స్నేహితుడికి అది కలిసి రాక వెనక్కి వెళ్లిపోయాడని, తాను మాత్రం వెళ్లలేక అక్కడే ఉండి ప్రయత్నాలు చేసి నటుడినయ్యానని ఆయన చెప్పారు.
తాను మ్యూజిషియన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చానన్న హర్ష వర్థన్.. చిన్నప్పటి నుంచి తనకు మ్యూజిక్ అంటే ఇష్టం అని, ఆ ఫీల్డ్‌లోనే ఏమైనా చేయాలని ఎప్పుడూ అనుకునేవాడినని ఆయన చెప్పారు. తాను కూడా ఇళయరాజా అంతటి స్థాయికి రావాలని అనుకున్నానని, కానీ ఆ తర్వాత తనకు తెలిసిందేమిటంటే వాళ్లు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని రాలేదు.. వచ్చాక నేర్చుకున్నారు అని ఆయన తెలిపారు. కానీ తాను మాత్రం ఆ ఫీల్డ్‌లో సెటిల్ కాలేకపోయానని హర్ష చెప్పారు.