Sai pallavi: వామ్మో సాయి పల్లవి కూడా అలాంటిదేనా… క్లాసులకు డుమ్మా కొట్టి ఆ పని చేసేదా?

Sai pallavi: సినీనటి సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. కేవలం సౌత్సి నిమాలో మాత్రమే కాకుండా బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటు కెరియర్ పరంగా సాయిపల్లవి ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా సాయి పల్లవి తాను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాయి పల్లవి తాను చదువుకున్న కోయంబత్తూరులోని ఎవిలా స్కూల్‌ వార్సికోత్సవాన్ని ముఖ్యఅతిథిగా హాజరైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు తాను చదువుకున్న పాఠశాలకు తాను ఇలా రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని అలాగే ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నా స్కూల్‌ టైంలో ఎక్కువగా ఈ ఆడిటోరియంలోనే ఉండేదాన్ని. క్లాస్‌కు డుమ్మా కొట్టి.. ఇక్కడికొచ్చి డ్యాన్స్ చేసేదాన్ని. నేను చాలా ఇంటెలిజెంట్‌ స్టూడెంట్‌నని మీరందరూ అనుకుంటూ ఉంటారు కానీ నేను మాత్రం స్కూల్ కి వచ్చి అటెండెన్స్ వేయించుకొని రోజు మొత్తం ఈ ఆడిటోరియంలోనే డాన్స్ ప్రాక్టీస్ చేసే దానిని తెలిపారు.

అప్పుడు నాకు ఈ విషయాలు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నాకు బాగా అర్థమవుతుంది. నిజానికి నేనేం చేస్తున్నానో టీచర్లకు బాగా తెలుసు. వాళ్లు అలా చేయడం వల్ల చాలా యంగ్ ఏజ్‌లోనే నాకు స్టేజ్‌ ఫియర్‌ పోయింది. నేనిక్కడి దాకా వచ్చేందుకు నాకు సపోర్ట్‌గా నిలిచారంటూ చెప్పుకొచ్చింది. ఇష్టంగా డ్యాన్స్ చేయడం, మెడిసిన్‌ చేయడం, మంచి మనిషిగా ఉండటం అంటే ఏమిటో తెలుసుకోవడం, క్రమశిక్షణ వల్ల నాకు లభించిన ప్రతిదాన్ని నేను పొందుతాను. పిల్లలతో నా జ్ఞాపకాలను ఇలా పంచుకోవడం ఆనందంగా ఉంది అంటూ సాయి పల్లవి తన సంతోషాన్ని తెలియజేశారు. ఇలా చిన్నప్పుడు క్లాసులు ఎగ్గొట్టి డాన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల నేడు గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతలు పొందారు అంటూ అభిమానులు ఈమె వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.