Jagapathi Babu: టాలీవుడ్ ఫ్యామిలీ హీరోగా విలన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లెజండరీ యాక్టర్ జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో సినిమాలలో అద్భుతమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జగపతి బాబు తాజాగా అశోక్ గల్లా హీరోగా నటించిన హీరో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా థాంక్స్ మీట్ కార్యక్రమంలో జగపతిబాబు పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేను గత 15 సంవత్సరాల నుంచి థియేటర్ కి వెళ్లి ఒక్క సినిమా కూడా చూడలేదు. 15 సంవత్సరాల తర్వాత మొదటి సారిగా హీరో సినిమాకు వెళ్లి సినిమా చూడటమే కాకుండా కడుపుబ్బా నవ్వుకున్నాను.అయితే ఈ సినిమాలో నటించాలని నేను అనుకోలేదు కానీ పద్మగారు మా సోదరికి ఒకటికి పది సార్లు ఫోన్ చేసి ఈ పాత్రలో మీరు నటిస్తేనే బాగుంటుందని చెప్పడంతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను.
ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కూడా నా పాత్రను ప్రేక్షకులు ఆహ్వానిస్తారా లేదా అన్న అనుమానం కూడా కలిగిందని తీరా సినిమా చూస్తే నాకు హనుమాన్ జంక్షన్ సినిమా గుర్తుకు వచ్చిందని తెలిపారు. ఇలాంటి పాత్రలు తీయాలన్నా దర్శకులకు ఎంతో అనుభవం ఉండాలని ఈ సందర్భంగా జగపతి బాబు హీరో సినిమాలో తన పాత్ర గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.
