Varun Sandesh: ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థ చేసుకునేంత సంబంధం ఉంటే ఆ బంధం ఎప్పటికీ విడిపోదని ప్రముఖ నటుడు వరుణ్ సందేశ్ చెప్పారు. అది ఏ రిలేషన్‌షిప్ అయినా సరే ఇద్దరి మధ్యా ఆ అండర్ స్టాండింగ్ ఉంటేనే ఆ బంధం ఎప్పటికీ స్ట్రాంగ్‌గా ఉంటుందని ఆయన తెలిపారు. ఒకవేళ అది జరగనపుడు ఆ బంధాన్ని వదులుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. అలాంటి సంఘటనలు ఇప్పటివరకు తనక్కూడా ఎదురయ్యాయని ఆయన వెల్లడించారు.
ఇకపోతే తాను అందరితోనూ అంత ఈజీగా కలిసిపోలేనని వరుణ్ సందేశ్ అన్నారు. అయితే బిగ్‌బాస్ నుంచి వచ్చాక మాత్రం తనకు చాలా మంది చాలా రకాలుగా మెసేజ్‌లు పెట్టారని ఆయన చెప్పారు. అవి చూసినపుడు తనకు చాలా ఆశ్చర్యం వేసిందని ఆయన తెలిపారు.
ఇక వివరాల్లోకి వెళితే తాను బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక కొందరు ఏమని మెసేజ్ పెట్టారంటే, మీ గురించి పూర్తిగా వేరేలా అనుకున్నాము, ఇంటర్వ్యూలలో, సినిమాల్లో చూసి కొంచెం భిన్నంగా ఉంటారని అనుకున్నామని, దానికి మేము నిజంగా సారీ చెప్తున్నాం. ఎందుకంటే మీ మీద ఉన్న అభిప్రాయం బిగ్ బాస్ షోలో చూశాక పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు వరుణ్ సందేశ్ అంటే కొన్ని ఇంటర్వ్యూల్లో, మూవీస్‌లో చూసి తనకు అటిట్యూడ్ ఉంటుందేమో, అమెరికా నుంచి వచ్చాడేమో, వేరేలా ఉంటాడేమో అని అనుకున్నామని తనకు కొంత మంది మెసేజ్‌లు చేసినట్టు వరుణ్ సందేశ్ చెప్పారు.
నిజంగా తన గురించి జనాలు ఇన్ని అనుకున్నారా అని ఆయన నవ్వుతూ అన్నారు. అలాంటి మేసేజ్‌లు దాదాపు 10 నుంచి 20 వరకు వచ్చాయని ఆయన చెప్పారు.