వేణు ఊడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాటపర్వం. ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం రామానాయుడు స్టూడియోలో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. విరాటపర్వం సినిమాలో సాయిపల్లవి నటించిన పాత్ర సరళ అనే మహిళ స్పూర్తితో తెరకెక్కింది. ఈ సినిమాలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో జీవించింది అని చెప్పటంలో సందేహం లేదు.
విరాట పర్వం సినిమా విడుదలకు ముందు దర్శకుడు వేణు, రానా, సాయి పల్లవి సరళ కుటుంబాన్ని కలిసారు. ఈ విషయం గురించి సాయి పల్లవి సాయి పల్లవి సక్సెస్ మీట్ వెల్లడించింది. సరళ కుటుంబం తనపై చూపించిన ప్రేమకి ముగ్దురాలిని అయ్యాను అంటూ సాయిపల్లవి చెప్పుకొచ్చింది. వారు నన్ను సొంత కుతురిలా నాపై ఎంత ప్రేమని చూపించారో ఆ అనుభూతి పొందాను. అదే సమయంలో సరళ లేని లోటు వాళ్ళల్లో బాగా కనిపించింది. ఆ బాధ నాకు కూడా కలిగింది. సినిమా షూటింగ్ కి ముందే సరళ కుటుంబాన్ని కలిస్తే బాగుండేదని, అందువల్ల ఈ సినిమాలో వెన్నెల పాత్రలో ఇంకా బాగా నటించేదాన్ని అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఈ విషయంలో సరళ అన్నయ్య తూము మోహన్‌రావుకి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇలాంటి ఓ కథతో సినిమా తీస్తానంటే ఎవరూ ఒప్పుకోరు.. భయమేస్తుంటుంది. కానీ సరళ అన్నయ్య మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సందర్భంగా సరళ ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చింది.
నేను ఫస్ట్ టైమ్ ఇలా నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలో నటించా. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదని పేర్కొంది. సరళ అన్నయ్య మోహన్ రావు తనకి చీర, బొట్టు పేట్టి పంపించారు. అది నాకు చాలా ఎమోషనల్ మూవ్‌మెంట్ అంటూ చెప్పుకొచ్చింది . ఈ సినిమాకి సురేష్ బాబు కూడా బ్యాక్ బోన్ లా ఉండి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. సురేష్‌బాబు సపోర్ట్ మరువ లేనిదని పేర్కొంది. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి , సినిమా చూసి ప్రశంసిస్తున్న సినీ వర్గాలకు ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. కొందరు ఒకటికి రెండు సార్లు చూసి బాగా అర్థం చేసుకుని సినిమా బాగా నచ్చిందని చెబుతున్నారు. మళ్లీ మళ్లీ చూస్తామని చెబుతున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.