ఆలోచించకుండా ఆ పాత్రలు చేశాను.. ఆ సినిమాలు మీరే కాదు నేను కూడా చూడలేదు: సోనాలి బింద్రె

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సోనాలి బింద్రె గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. మధ్యలో తన అనారోగ్య సమస్యతో సినిమాలకు బ్రేక్ ఇవ్వగా మళ్లీ రీ ఎంట్రీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా తాను ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నగా కొన్ని విషయాలు పంచుకుంది.

ఒకానొక సమయంలో తనకు చాలా డబ్బులు అవసరం అయ్యాయని.. ఇల్లు అద్దెకు ఇచ్చే పరిస్థితిలో కూడా లేమని అన్నది. అందుకే ఏ పాత్రలు వచ్చినా చేశానంటూ.. అలా ఓ సినిమా చేసి ఇంకో సినిమాకు రెడీ అయ్యే సమయానికి ఎందుకా ప్రాజెక్టు ఒప్పుకున్నానని ఆలోచించేదట. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూసేదట. అలా అతిగా ఆలోచించకుండా కొన్ని పాత్రలు చేసుకుంటూ పోయానని ఆ సినిమాలు మీరే కాదు నేను కూడా చూడలేదు అంటూ తెలిపింది.