అంత మంచి కూతురికి తల్లిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను.. సింగర్ సునీత..!

ప్రముఖ సింగర్ సునీత గురించి తెలియని వారుండరు. సింగర్ గా ప్రేక్షకులలో సునీతకి ఉన్న క్రేజీ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈమె తన మధురమైన స్వరంతోనే కాకుండా తన అందంతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఎన్నో ఏళ్లుగా స్టార్ సింగర్ గా గుర్తింపు పొందిన సునీత పాడిన ప్రతి పాట ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది. సునీత సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో సింగింగ్ షోస్ కి సునిత జడ్జిగా వ్యవహరించారు.

ఇలా నిత్యం టీవీ షోస్, రికార్డింగ్స్ తో బిజీగా ఉండి సునీత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. అభిమానుల కోరిక మేరకు పలు సందర్భాలలో లైవ్ లోనే పాటలు పాడింది. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియా వేదికగా సునీత తన కూతురి ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. సునీత తన కూతురు పుట్టినరోజు సందర్భంగా కూతురికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. చాలా ఎమోషనల్ అయ్యింది. ఈ క్రమంలో కూతురితో కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కూతురు బర్త్ డే సూపర్ డూపర్ బర్తడే అంటూ పోస్ట్ చేస్తూ తను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ రాసుకొచ్చింది.

ఈ క్రమంలో కూతురి గురించి చెప్తూ..ఇంత మంచి కూతురికి తల్లిని అయినందుకు చాలా గర్వంగా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం సునీత షేర్ చేసిన ఫోటోలతో పాటు ఈ పోస్టు కూడా వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నెటిజన్లు సునీత కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలాఉండగా ఇంతకాలం ఒంటరిగా పిల్లల్ని పెంచి పెద్ద చేసిన సునీత కొంతకాలం క్రితం రెండవ వివాహం చేసుకుంది. సునీత ఈ పెళ్ళి చేసుకోవటానికి ఆమె పిల్లలే కారణం. తమ కోసం ఒంటరిగా పోరాడి ఇంత వాళ్ళని చేసిన తమ తల్లికి పిల్లలు రెండవ పెళ్ళి చేశారు. ప్రస్తుతం సునీత భర్త, పిల్లలతో సంతోషంగా ఉంది.