Hyper Aadi: జబర్దస్త్ లో అనసూయ రెమ్యూనరేషన్.. ఎంతో చెప్పేసిన హైపర్ ఆది?

Hyper Aadi: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు హైపర్ ఆది. తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు హైపర్ ఆది. తన స్కిట్ లో భాగంగా నాన్ స్టాప్ పంచులతో షో లో జడ్జిలు మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై పంచ్ లు వేస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇకపోతే బుల్లితెరపై అనసూయ, హైపర్ ఆది కాంబినేషన్ గురించి మనందరికీ తెలిసిందే.

హైపర్ ఆది తన స్కిట్ లో భాగంగా అనసూయ ఎంట్రీ డాన్స్ చేయడం, అలాగే అనసూయ పై పంచులు వేయడం, కొన్ని కొన్ని సార్లు శృతిమించి మరి అనసూయ పై తనకున్న ప్రేమను బయట పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాడు. హైపర్ ఆది తన ప్రతి ఒక స్కిట్ లో అనసూయపై ఏదో ఒక సీనియర్ వేస్తూనే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే అనసూయ మీదున్న ప్రేమ, కోరికను తెలిపేలా డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోతోంటాడు. తాజాగా కూడా హైపర్ ఆది మరొకసారి కాస్త హద్దులు దాటేశాడు.

ఇందులో భాగంగానే అనసూయను ఒక ముద్దు అడిగాడు.. ఒక్క చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అందరి ముందే చెప్పేశాడు. భరద్వాజ్‌తో పెళ్లి మళ్లీ మళ్లీ చూడలేను అంటూ అనసూయ ప్రేమను వ్యక్తపరిచాడు. ఇక స్కిట్ లో భాగంగానే హైపర్ ఆది రెమ్యూనరేషన్ గురించి వాగేశాడు. అందరికంటే ఎక్కువగా రోజా, అనసూయలకే ఉంటుందని చెప్పేశాడు. స్కిట్ లో భాగంగా అనసూయ ఓ డైలాగ్ వేస్తుంది. నువ్వు ఇన్ని అంటున్నా కూడా మేము ఇక్కడే ఎందుకున్నానో తెలుసా? అని అనసూయ అడుగగా.. అప్పుడు హైపర్ ఆది బాగా తెలుసు మా అందరి కంటే నీకు రోజా గారికి పేమెంట్ ఎక్కువ కాబట్టి అని కౌంటర్ లు వేశాడు. దీంతో అనసూయ, రోజాలు తెగ నవ్వేసుకున్నారు. అయితే హైపర్ ఆది ఫ్లో లో వారిద్దరి రెమ్యూనరేషన్ గురించి లీక్ చేశాడు.