కామెడీ స్టార్స్ లో హైపర్ ఆది జాయిన్‌ అవ్వకపోవడానికి అసలు కారణం అదేనా..?

ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో నుంచి ఒక్కొక్క కమెడియన్ తప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కామెడీ షో నుంచి తప్పుకుంటున్న కొందరు కమెడియన్లు ఇతర కామెడీ షోలో పాల్గొంటున్నారు. ఇంకొందరు మాత్రం సినిమాలలో అవకాశాలు రావడంతో బిజీ బిజీగా ఉన్నారు. జబర్దస్త్ షోలో లేదంటే స్టార్‌ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో ఎంట్రీ ఇస్తున్నారు. అక్కడ ఇక్కడ లేని వారు అనే వారు ఎవరు లేరు. ఇక ప్రస్తుతం హైపర్ ఆది పరిస్థితి కూడా అదే అయ్యిందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ నుంచి హైపర్ ఆది తప్పుకుని నెలలు గడుస్తోంది.

ఆది ఒక్కో కాల్షీటు ధర లక్ష నుండి రెండున్నర లక్షల వరకు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అలాంటి ఆది తన డేట్లను ఇంతగా వృదా ఎలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అంటూ మీడియా వర్గాల వారు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆది ప్రస్తుతం ఏమి చేస్తున్నాడు అన్నది ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్న ప్రశ్న..హైపర్ ఆది జబర్దస్త్ ను వీడితే ఖచ్చితంగా స్టార్‌ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ లో జాయిన్ అవుతాడు ని ప్రచారాలు కూడా జరిగాయి. కానీ అలా జరగక పోగా అసలు కామెడీ స్టార్స్ లోకి హైపర్ ఆది ని ఆహ్వానించ లేదట. స్టార్‌ మా వర్గాల వారు కాస్త డెప్త్‌ గా ఆలోచించి పూర్తిగా స్టార్‌ మాలో కామెడీ స్టార్స్ అనేది జబర్దస్త్‌ టీమ్‌ అవుతుందని అలా కాకూడదు అనే ఉద్దేశ్యంతో హైపర్ ఆదిని తీసుకోలేదు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.

అంతే కాకుండా స్టార్ మా వారికి కామెడీ స్టార్స్ తో వచ్చే ఆదాయం చాలా తక్కువ. అలాంటి సమయంలో కామెడీ స్టార్స్ లో ఆయన్ను తీసుకుంటే భారీ గా పారితోషికం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో స్టార్‌ మా వారు హైపర్ ఆది ని పిలవలేదు అని తెలుస్తోంది. ఒక వేళ హైపర్‌ ఆది ఎంటర్‌ అయితే షో రేటింగ్‌ పెరుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. అందుకే కామెడీ స్టార్స్ నుండి హైపర్‌ ఆదికి ఆహ్వానం అందలేదు అని తెలుస్తోంది.