అనుమానం పెనుభూతం అని అంటారు. ఈ అనుమానం అన్నది ఒక్కసారి మనసులో పుట్టింది అంటే ఆ మనిషి చావడానికైనా చెప్పడానికైనా సిద్ధంగా ఉంటాడు. అంతేకాకుండా ఇద్దరూ ఆలుమగల మధ్య లో అనుమానం అన్న పదం వచ్చింది అంటే చాలు వారి కాపురం చిన్నాభిన్నం అయిపోతుంది. అయితే ఈ అనుమానంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, కొందరు అదే అనుమానంతో ఎదుటి వ్యక్తులను చంపడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.. ఒక వ్యక్తి కట్టుకున్న భార్యపై అనుమానంతో అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి మరీ పారిపోయాడు. ఈ అత్యంత దారుణమైన ఘటన మూసాపేటలో చోటుచేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే…
ఒడిస్సా రాష్ట్రం రంప గ్రామానికి చెందిన పుణ్యవతి అలియాస్ భవాని శిరీష అనే ఒక యువతి, శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా గ్రామానికి చెందిన సంతోష్ తో ఈ ఈ సంవత్సరం మే నెలలో పెళ్లి అయింది. అయితే పెళ్లిలో కానుకగా శిరీష తల్లిదండ్రులు మూడు లక్షలు బంగారు అలాగే కొన్ని వస్తువులు కట్నంగా ఇచ్చారు. పెళ్లి తరువాత సంతోష్, శిరీష హైదరాబాద్ లో నివసిస్తున్నారు. సంతోష్ హైదరాబాదులోని మూసాపేట గూడ్స్ షెడ్ వద్ద వెల్డింగ్ షాప్ గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య మీద అనుమానంతో ఆరు నెలల లోపే నాలుగు ఇల్లులు మారాడు సంతోష్. అతను పనిచేసే వెల్డింగ్ షాప్ ఎదురుగా ఉన్న ఇంట్లో అద్దెకు దిగాడు. ఆ తర్వాత తన భార్యని హింసించడం కొట్టడం, శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆరు నెలలుగా తరచూ అతను గొడవ పడేవాడు.
దీంతో విసుగు చెందిన శిరీష అతని పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చి మరొకసారి ఇలాంటివి రిపీట్ చేయకు అని ఇరువురు కుటుంబ సభ్యులకు హెచ్చరించిన కూడా అతనిలో మార్పు కనిపించలేదు. శిరీషను మళ్ళీ వేధించడం మొదలు పెట్టాడు. ఎప్పటిలాగానే గొడవ జరిగి పెద్దదయ్యింది. ఈ క్రమంలోనే సంతోష్ క్షణికావేశంలో హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి మరీ పారిపోయాడు. ఇక శిరీష కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తుంటే లేకపోయేసరికి మరుసటి రోజు ఉదయం నుంచి ఇంటి తలుపులు తెరిచే చూసేసరికి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కి పంపించారు. ఆమెను తన భర్త హత్య చేసి ఉంటాడని భావించి అతనిపై కేసు నమోదు చేసి ప్రారంభించారు. సంతోష్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.