సాధారణంగా జీవితం అన్న తర్వాత ఇంట్లో కష్టాలు ఉంటాయి. అయితే ఆ కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలి కానీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడి వెనకడుగు మాత్రం చేయకూడదు.అయితే కొందరు కష్టాలను ఎదిరించి జీవితంలో ముందుకు సాగగా మరికొందరు ఆ కష్టాలను చూసి భయంతో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి భయం ఒక కుటుంబాన్ని దారుణంగా బలిగొంది. కేవలం అప్పులబాధతో సతమతమైన ఆ కుటుంబం కన్నపేగుని తమ చేతులతో చంపి ఆపై ఆ భార్యభర్తలిద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని న్యూవాషర్ మెన్‌పేటలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
వెంకటేశన్ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో శివాజీ, వనితా అనే దంపతులకు వెట్రివేల్ (10) అనే కుమారుడున్నాడు. శివాజీ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించగా వనిత ఒక ప్రైవేట్ కంపెనీలో పనికి వెళ్ళేది. అయితే కరోనా సమయంలో వీరికి ఎలాంటి పనులు లేకపోవడంతో తెలిసిన వారి దగ్గర పెద్ద ఎత్తున అప్పులు చేశారు.ప్రస్తుతం అప్పు ఇచ్చిన వారు ఇంటి దగ్గరికి వచ్చి వారి అప్పులు చెల్లించాలని అధిక ఒత్తిడి చేయడంతో వారికి అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.
ఈ విధంగా వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుంటే తన కొడుకు పరిస్థితి ఏంటి అని ఆలోచించి కొన్ని రోజులపాటు ముఖ భావంగా ఉన్న ఈ దంపతులు మంగళవారం సాయంత్రం తన కుమారుడిని హత్య చేసి అనంతరం వీరిద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం వీరి ఇంటి దగ్గర ఎలాంటి అలికిడి లేకపోవడంతో స్థానికులు తలుపులు తీసి చూడగా ముగ్గురు శవమై కనిపించేసరికి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేవలం అప్పుల కారణంగానే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.