ప్రస్తుతం యూట్యూబ్ చూసేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది యూట్యూబ్ వీడియోస్ చూసి వివిధ రకాల నైపుణ్యాలను మెరుగుపరుచుకోగా కొందరు మాత్రం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒక ప్రబుద్ధుడు యూట్యూబ్ లో వీడియో చూసి తన భార్య పురిటి నొప్పులతో బాధ పడుతుంటే డెలివరీ చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
తమిళనాడులోని నేమిలి జిల్లా పణపాకం గ్రామానికి చెందిన లోకనాథన్, గోమతి దంపతులు ఉండేవారు లోకనాథన్ చిరు వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించేవారు. ఈ క్రమంలోనే గోమతి గర్భందాల్చి నెలలు నిండాయి. ఇక ఆమె ఈనెల 18వ తేదీ పురిటి నొప్పులతో బాధపడుతూ తన భర్తకు ఫోన్ చేయడంతో తన భర్త అలాగే తన సోదరుడితో కలిసి యూట్యూబ్ వీడియో చూసి తనకి ఇంటిలోనే ప్రసవం చేశారు. ఇలా గంట సమయం పాటు ఆమెకు డెలివరీ చేయడానికి ప్రయత్నించారు. ఇలా ఒక బిడ్డకు జన్మనివ్వడంతో బిడ్డ జన్మించిన వెంటనే మరణించింది.
అదేవిధంగా గోమతికి అధిక రక్తస్రావం కావడంతో స్పృహ కోల్పోయింది. అలా తన భార్య స్పృహ కోల్పోవడంతో లోకనాథన్ తనని దగ్గరలో ఉన్న ప్రాథమిక కేంద్రానికి తీసుకువెళ్లగా ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రికి తరలించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే పోలీసులు సంబంధిత వైద్య అధికారులు స్పందించారు.