Crime News: వివాహం చేసుకున్న తర్వాత అమ్మాయిలు ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగు పెడతారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది అత్తింటి వారు పెట్టే బాధలు భరించలేక, పుట్టింటి వారికి భారం కాలేక అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటన ఇటీవల కర్ణాటకలో చోటు చేసుకుంది. అత్తింటివారుఅదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని మస్కిల్ గ్రామానికి చెందిన మహదేవ్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సువర్ణ అనే మహిళ ని ఏడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు.పెళ్లి జరిగిన కొన్ని రోజుల వరకు వారి జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది. 5 సంవత్సరాల క్రితం ఆ దంపతులిద్దరూ పటాన్ చెరువు వచ్చి అక్కడ జేసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. మహదేవ్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సువర్ణ కూడా ఒక ప్రైవేటు పరిశ్రమల పనిచేస్తోంది. ఈ క్రమంలో మహదేవ్ సొంతంగా ఒక ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు.
అయితే గత కొంత కాలంగా వాహనం కొనుగోలు చేయడానికి పుట్టింటి నుండి డబ్బు తీసుకురావాలని తరుచూ భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు.ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. అదనపు కట్నం కోసం తరచూ భర్త వేధిస్తుండటంతో తల్లిదండ్రులకు భారం కాలేక తీవ్ర మనస్థాపానికి గురి చెందిన సువర్ణ శుక్రవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో గదిలో ఫ్యాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఇంటికి వచ్చిన మహదేవ్ భార్య ఎంత సేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా సువర్ణ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి సువర్ణ భర్త ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.