East Godavari: భార్యతో కలహాల రావడంతో పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భర్త!

East Godavari: భార్య భర్తలు అన్న తర్వాత వారి మధ్య గొడవలు రావడం సర్వసాధారణం. ఇలా ఎన్నో సార్లు గొడవ పడుతూ అనంతరం ఒక్కటై ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఈ గొడవలు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఈస్ట్ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. గోకవరానికి చెందిన తాతూరి బంగార్రాజు అనే వ్యక్తికి భార్యా, ముగ్గురు సంతానం కాగా భార్యతో గొడవపడి పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ క్రమంలోనే బంగార్రాజు భార్య ఉద్యోగం నిమిత్తం పిల్లలను తన తల్లి సంరక్షణలో ఉంచి కువైట్ వెళ్లారు. ఇలా కువైట్ లో పని చేస్తూ జీవితాన్ని గడుపుతున్న బంగార్రాజు భార్య సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఈనెల13న సంక్రాంతి పండుగ సందర్భంగా బంగార్రాజు వంగలపూడిలోని అత్తారింటికి వచ్చాడు. ముగ్గురు పిల్లలు… 14 ఏళ్ల కుమార్తె, 12, 10 ఏళ్ల కుమారులను తీసుకుని సీతానగరం కైలాస భూమి వద్దకు వచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న బంగార్రాజు కూల్ డ్రింక్ లో మందు కలిపి తన కుమారుడికి తాగించారు.

అయితే ఈ విషయాన్ని అంతటినీ గమనిస్తున్న మరో ఇద్దరు పిల్లలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే విషం తాగి ఉన్న తండ్రి కొడుకుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.