RGV: మెగా బెగ్గింగ్ తో హర్ట్ అయ్యా…. వర్మ ట్వీట్ వైరల్!

RGV:గత కొంత కాలం నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ల రేట్లు వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్లను పెంచుతూ సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనతో ఈ విషయం గురించి చర్చించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే టిక్కెట్ల రేట్ల విషయంపై ఏపీ ప్రభుత్వం ఏమాత్రం తన నిర్ణయం మార్చుకోక పోవడంతో నిన్న టాలీవుడ్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేష్, రాజమౌళి, కొరటాల వంటి పలువురు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రితో భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరందరూ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆయన సానుకూలంగా ఉన్నారని ఆయనకు మీడియా ముందు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రితో భేటీ పై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ… సర్ చిరంజీవి గారు నేను మీ అభిమానిగా మీ మెగా బెగ్గింగ్ కు హర్ట్ అయ్యాను. అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీటితో పాటు వర్మ టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన వీడియోని కూడా జత చేశారు. ఇలా వర్మ తన ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.ఈ విధంగా చిరంజీవి గురించి ట్వీట్ చేసిన వర్మ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అప్పటికే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.