ఏబీయన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానెల్, ఆంధ్రజ్యోతి దిన పత్రిక అధినేత రాధాకృష్ణ కంపెనీకి చెందిన వాహనంలో భారీగా గుట్కా ప్యాకెట్లు బయటపడ్డాయి. కర్నూలు జిల్లాలో నంద్యాలకు ఆంధ్రజ్యోతి దినపత్రికలు తరలిస్తున్న ఆయన కంపెనీకి చెందిన వాహనంలో గుట్కాలు ఉండటంతో వాహనాన్ని సీజ్ చేసారు. అందులో సరుకుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తుకు రంగం సద్ధం చేసారు. దినపత్రికలు తరలించాల్సిన వాహనంలో గుట్కా ప్యాకెట్లు ఎలా వచ్చాయి? ఉద్దేశ పూర్వకంగా తరలిస్తున్నారా? లేక! డ్రైవర్ కి తెలియకుండా వాహనంలోకి ఎక్కించారా? అని అన్ని రకాల కోణాల్లో పోలీసులు విచారణ చేపటడుతున్నట్లు సమాచారం.
వాహనంలో పదో ..ఐదో ప్యాకెట్లు ఉంటే విషయం పెద్ద సీరియస్ అయ్యేది కాదు. భారీ ఎత్తున తోరణాల తోరణాల ప్యాకెట్లు వాహనంలో రహస్య ప్రదేశాల్లో దాచి తీసుకెళ్తున్నారు. బండి మొత్తం వెతికితే ప్యాకెట్లు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. అయితే ఇన్ని ప్యాకెట్లు తరలించడంతో పోలీసులు ఈ వ్యవహారంలో స్థానికంగా ఉన్నఆంధ్రజ్యోతి కంపెనీకి- ఈ తరలింపుకు ఏదైనా సంబంధం ఉందా? అనుమానం బలంగా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే గుట్కాలు నిషేధించి చాలా కాలమవుతోంది. అక్రమ అమ్మకాలపైనే ఎప్పటికప్పుడు డిపార్టెమెంట్ వారు మప్టీలో వచ్చి కేసులు నమోదు చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఓ వింగ్ పనిచేస్తోంది. ప్రస్తుతం దేశం లాక్ డౌన్ కొనసాగుతుం డటంతో మత్తు పదార్ధాల ధరలు భారీగా పెంచి విక్రయిస్తున్నారు. ఆక్రమంగా ఇతర రాష్ర్టాల నుంచి తెచ్చి ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. మద్యం షాపులకు అనుమతివ్వని రోజుల్లో బ్లాక్ మార్కెట్ లో నూ పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. ఏపీలో మద్య నిషేధంలో భాగంగా షాపుల సంఖ్య తగ్గడం, ధరలు ఆకాశన్నంటడం..క్వాలిటీ లేని మద్యం ప్రభుత్వం సరఫరా చేయడంతో మందు బాబులు నాటు సారా వైపు పరుగులు తీస్తున్నారు.