“హరిహర వీరమల్లు” లో ఈ ఒక్క సీన్ కోసం భారీ బడ్జెట్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ల తర్వాత పవన్ చేస్తున్న హై బడ్జెట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ కెరీర్ లోనే ఇది అత్యధిక బడ్జెట్ సినిమా సహా పాన్ ఇండియా సినిమా కాగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి ఈ చిత్రాన్ని అయితే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా ఇప్పుడు అయితే సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ ని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ పై మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ అంతా కూడా ఒక భారీ యాక్షన్ సీన్ మాత్రమే అట. ఇందులో పవన్ పై ఓ క్రేజీ సీక్వెన్స్ ని ఫైట్ మాస్టర్ డిజైన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి చెప్తే నమ్మరు కానీ దాదాపు 20 రోజుల మేర షూటింగ్ ఉండే ఈ ఒక్క సీన్ కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు చిత్ర బృందం ఖర్చు చేస్తున్నారట.

ఇది మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. క్రిష్ అయితే ఈ సీన్ ని చాలా ప్లాన్డ్ అండ్ పర్ఫెక్ట్ గా తీస్తున్నాడని తెలుస్తుంది. మరి సిల్వర్ స్క్రీన్ పై అయితే ఈ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇంకా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా చిత్ర బృందం ఎలా అయినా వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట.