War 2: డబ్బింగ్ సినిమాలలో ఎన్టీఆర్ వార్2 మరో సరికొత్త రికార్డు సృష్టించనుందా?

War 2: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. చివరగా దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. టెంపర్ సినిమా తరువాత నటించిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయం అందుకోవడంతో పాటు పాన్ ఇండియా హీరోగా మారిన విషయం తెలిసిందే. గత ఏడాది విడుదల అయినా దేవరా సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది.

కానీ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కారణంగా ఈ సినిమాకు దాదాపుగా 400 కోట్లకు పైగా వాసులను చేసి మూవీ మేకర్స్ ని గట్టెక్కించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ లను ఎంజాయ్ చేస్తూనే వరస సినిమాలతో ఫుల్ బిజీ బిజీ అవుతున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం తారక్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా వార్ 2. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది బాలీవుడ్ సినిమా. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా విషయంలో కాస్త భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవి ఏమిటంటే ఎన్టీఆర్ నటిస్తున్నప్పటికీ ఇది బాలీవుడ్ అనువాద చిత్రమే అని చెప్పాలి.

అందుకే ఈ సినిమా బిజినెస్ స్ట్రెయిట్ తెలుగు సినిమాల స్థాయిలో అయితే జరగడం లేదు. ఇకపోతే ఈ సినిమా తెలుగు స్టేట్ రైట్స్ కోసం దాదాపుగా 90 కోట్ల వరకు అమ్ముడు అవుతున్నట్టు తెలుస్తోంది. 90 కోట్లు అన్నది ఎన్టీఆర్ ఇమేజ్ కు చాలా చిన్న విషయమే అని చెప్పాలి. కానీ డబ్బింగ్ సినిమాల పరంగా చూసుకుంటే మాత్రం ఇది సరికొత్త రికార్డు అనే చెప్పవచ్చు. డబ్బింగ్ సినిమాలలో ఈ ఎన్టీఆర్ వార్ 2 సినిమా సరికొత్త రికార్డు సృష్టించనుంది అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారు అన్న విషయంపై కూడా వార్ 2 సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయినట్టు తెలుస్తోంది. ఇక జూలై చివరివారం నుంచి ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారట మూవీ మేకర్స్. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.