Hrithik Roshan: బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన లేటేస్ట్ మూవీ వార్ 2. YRF స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో స్టార్ హీరోస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లు ప్రధాన పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు మేకర్స్.
ఈ సందర్భంగా ఈవెంట్ లో భాగంగా హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు.. మనం అందరం ఒకే కుటుంబం. చాలా కాలం క్రితం క్రిష్ షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాను. తెలుగు ప్రజల అభిమానం, ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మరోసారి మీ ముందుకు వచ్చాను. తారక్ నేను కోస్టార్స్ గా స్టార్ట్ చేశాము. కానీ చివరకు ఇద్దరం బ్రదర్స్ అయ్యాము. తారక్ రియల్ టైగర్. ఎన్టీఆర్ బెస్ట్ చెఫ్. మీరందరూ నాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. నేను కూడ మీకు ప్రామిస్ ఇస్తున్నాను. మీరందరూ నా తమ్ముడిని ఎప్పటికీ ఇలాగే ప్రేమించాలి.
నా కెరీర్ లోనే వార్ 2 టాప్ ప్లేస్ లో ఉంటుంది. నాకు ఇందులో కబీర్ పాత్ర చేసినప్పుడు ఎంతో గుర్తింపు వచ్చింది. ఎవరూ మిస్ అవ్వొద్దు. యాక్షన్ సీన్లలో ఎన్నో గాయాలు అయ్యాయి. నేను గాయాలు అయితే వెంటనే కోలుకోలేను అని తెలిపారు హృతిక్ రోషన్. ఈ ఈవెంట్ లో భాగంగా హృతిక్ రోషన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Hrithik Roshan: తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు.. మనం అందరం ఒకే కుటుంబం: హృతిక్ రోషన్
