జబర్దస్త్ ద్వార ఆది ఎంత ఆస్తి వెనకేసాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొందిన హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ఆది మొదట అదిరే అభి టీం లో స్క్రిప్ట్ రైటర్ గా అవకాశం అందుకున్నాడు. ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగాడు. జబర్దస్త్ లో ఆది ఎంట్రీ ఇచ్చిన తర్వాత జబర్దస్త్ రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి అనటంలో సందేహం లేదు. జబర్దస్త్ లో మిగిలిన టీమ్ లీడర్లు చేసే కామెడీ ఒక ఎత్తైతే.. ఆది ఒక్కడే తన పంచులతో చేసే కామెడీ మరొక ఎత్తు. ఆది స్కిట్ కోసమే చాలామంది జబర్ధస్త్ చూసేవాళ్ళు ఉన్నారు అనటంలో అతిశయోక్తి లేదు.

కానీ ప్రస్తుతం ఆది జబర్ధస్త్ లో కనిపించటం లేదు. అయినా కూడా శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షో ద్వారా ప్రేక్షకులని అలరిస్తున్నాడు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన ఆది సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఆది వెండితెర మీద క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా ఎన్నో సినిమాలలో నటిస్తున్నాడు. ఇలా టీవి షోస్, సినిమాలతో ఆది బాగానే ఆస్తులు కూడబెట్టుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా ఉన్న సమయంలోనే ఆది ఎక్కువగా సంపాదించాడని, ఆ సంపాదనతో ఊర్లో పొలాలు కొన్నాడని తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆది స్వయంగా చెప్పుకొచ్చాడు. గతంలో ఒక టీవి షో లో ఆది తన ఆస్తుల వివరాలు బయటపెట్టాడు. తన చదువు కోసం ఉన్న 3ఎకరాలు అమ్మి తన నాన్న డబ్బులిచ్చి నన్ను హైదరాబాద్ పంపించాడని ఆది చెప్పుకొచ్చాడు. అయితే జబర్దస్త్ లో టీమ్ లీడర్ గా గుర్తింపు పొందిన తర్వాత అదే ఊర్లో ఇప్పుడు 16 ఎకరాల పొలం కొన్నాడు. అంతే కాకుండా హైదరాబాద్ లో ఒక విలాసవంతమైన ఫ్లాట్ కూడా కొన్నట్టు తెలుస్తోంది. ఇక తన నాన్న కోసం 10 వేళ్ళకు 10 ఉంగరాలు కూడా చేయించాడు. ఇలా ఒక సంవత్సరానికి ఆది ఆదాయం ఒక కోటి రూపాయల వరకు ఉంటుందని సమాచారం.