Year End 2021: ప్రతి ఏడాది ఎంతో మంది సెలబ్రిటీలు వివాహాలు చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. అదే విధంగా మరింత మంది సెలబ్రెటీలు వారి వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని ఉంటారు. ఇలా పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇండస్ట్రీకి చెందిన కొంతమంది విడాకులు తీసుకుని విడిపోయారు.మరి ఆ విడాకులు తీసుకున్న జంటలు ఎవరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
అమీర్ ఖాన్-కిరణ్ రావు: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ ఏడాది తన రెండో భార్య విడాకులు ఇచ్చారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.
సమంత-నాగ చైతన్య: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న ఈ జంట ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి జీవితంలో పలు మనస్పర్ధలు రావడం వల్ల ఈ జంట ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.
నుస్రత్ జహాన్- నటి నిఖిల్ జైన్: విదేశాలలో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత కోల్‌కతాలో రిసెప్షన్ ఎంతో ఘనంగా జరుపుకునే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు.
కీర్తి కుల్హారి- సాహిల్ సెహగల్: వీరు వివాహం అయిన 5 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారు. 2016లో వీరి వివాహం జరిగింది. ఇలా వీరితో పాటు నటి నిషా రావల్- భర్త కరణ్ మెహ్రా, సింగర్
యోయో హనీ సింగ్- షాలిని జంటలు కూడా విడాకులతో విడిపోయారు.