జి‌హెచ్‌ఎం‌సి ఎలక్షన్ ఆఖరి అరగంటలో – ఆన్సర్ లేని అతిపెద్ద సీక్రెట్ నడిచింది

KCR planning behind GHMC elections 

తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల హడావిడి నడుస్తుంది. మొన్న దుబ్బాక ఎన్నికలు, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ప్రజలకు చాలా ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు. ప్రజలు కూడా ఈ ఎంటర్ టైన్మెంట్ ను బాగానే ఎంజాయ్ చేశారు కానీ ఎన్నికల రోజు మాత్రం ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు రావడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేవారు లేకపోవడం వల్ల పోలింగ్ అధికారులు నిద్రపోయారు.

మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరిగిన పోలింగ్ కేవలం 3.96 శాతమే. 11 గంటల వరకు కూడా అదే పరిస్థితి. ఇంకో నాలుగున్నర శాతం వచ్చారు. అంటే 8.90 శాతం పోలింగ్. ఇక మధ్యాహ్నం ఓటర్లు వస్తారని తినే తీరిక ఉండదనే ఎదురుచూపుల్లో సిబ్బంది ఉన్నారు. అయినా మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఇంకో పదిశాతం పోలైంది. దీంతో సగం రోజులో 18శాతం పోలింగ్ జరిగింది.

ఉదయం నుంచి అసలు ఇవి ఎన్నికలేనా అన్నట్టు సాగిన పోలింగ్ ఆఖరి గంట మాత్రం అద్భుతాన్ని సృష్టించింది. ఎన్నికలు ముగిసే సమయానికి గతంలో కంటే ఎక్కువ ఓటు శాతం నమోదు అయింది. అయితే అందరూ ప్రభుత్వమే అధికారుల సహకారంతో దొంగ ఓట్లు వేయించిందని, ఈ అద్భుతం అధికార పార్టీ ముసుగులో ఎన్నికల సంఘం సృష్టించిందని రాష్ట్రమంతా అనుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం 35.80 శాతం ఉండగా కేవలం చివరి అర గంటలోనే ఇదంతా ఎలా జరిగిందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వోటింగ్ లో నిజంగానే ఏదైనా తప్పు జరిగిందా లేక నిజంగానే ఓటింగ్ పెరిగిందా అనేది కాలమే నిర్ణయించాలి.