10 రూపాయలకే చికెన్ బిర్యానీ.. హోటల్ యజమానిని అరెస్ట్ చేసిన పోలీసులు

hotel owner arrested for selling biryani for Rs.10

10 రూపాయలకు చికెన్ బిర్యానీ అమ్మితే అరెస్ట్ చేస్తారా? ఇది మరీ ఘోరం. రూపాయికి కూడా కొందరు బిర్యానీ అమ్మారు కదా.. అని ఆవేశపడిపోకండి. పూర్తిగా చదవండి…

hotel owner arrested for selling biryani for Rs.10
hotel owner arrested for selling biryani for Rs.10

ఓ వ్యక్తి కొత్తగా హోటల్ ప్రారంభించాడు. బిర్యానీ హోటల్ అది. బిర్యానీకి ఫేమస్. కానీ.. జనాలకు ఎలా తెలిసేది. కొత్తగా పెట్టిన హోటల్ కదా. జనాలకు తన హోటల్ లో బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అని తెలియాలి.. అంటే ఏం చేయాలి అని తెగ ఆలోచించాడు. సూపర్ ఐడియా తట్టింది. అంతే.. వెంటనే 10 రూపాయలకే చికెన్ బిర్యానీని విక్రయించడం మొదలు పెట్టాడు.

ఇక జనాలు ఊరుకుంటారా? కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టి మరీ బిర్యానీని కొనడం మొదలు పెట్టారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. అంతేనా.. అసలే కరోనా కాలం. జనాలు చికెన్ బిర్యానీ అనేసరికి.. కరోనా జాగ్రత్తలేవీ పాటించకుండా ఆ హోటల్ లో ఎగబడ్డారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కరోనా సమయంలో ఇలాంటి తలతిక్క ఆఫర్లు పెట్టిన హోటల్ యజమానిని అరెస్ట్ చేశారు. మిగిలిన బిర్యానీని యాచకులను ఉచితంగా పంపిణీ చేసి… అక్కడి నుంచి జనాలను చెదరగొట్టారు.