Kavya Thaper : హాట్ అలర్ట్:  కావ్య థాపర్ ‘ఏక్ మినీ’ వైరల్ ముచ్చట

Kavya Thaper :  ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ముద్దుగుమ్మ కావ్య థాపర్. తొలి సినిమానే అయినా, ఈ సినిమాలో తన క్యూట్ లుక్స్‌తో బాగా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మరోసారి ప్రేక్షకులకు దగ్గరైంది కావ్య థాపర్.

రిజిస్టరయ్యే ముఖమే. గ్లామర్‌లో ఎలాంటి మొహమాటాల్లేవ్. యాక్టింగ్ టాలెంట్ విషయంలోనూ పెద్దగా వంకలు పెట్టడానికేమీ లేదు. కానీ, అవకాశాలు మాత్రం అరకొరగా వస్తున్నాయ్ కావ్య థాపర్‌కి. అదేంటో అన్నీ నిండుగా వున్న ముద్దుగుమ్మలు రేసులో వెనకెనకే వుంటున్నారీ మధ్య.

సరే, అసలు విషయానికి వచ్చేస్తే, కావ్య థాపర్‌ దశ తిరిగిందనిపిస్తోంది. అంతలా ఏం క్రేజీ ఆఫర్లు పట్టిందా ఈ ముద్దుగుమ్మ.. అనుకుంటున్నారా.? క్రేజీ ఆఫర్ అనలేం కానీ, ఓ ప్రైవేట్ సాంగ్ వీడియోలో కావ్య థాపర్ నటించింది.

‘గోరా చిట్టరంగ్ మేరా..’ అంటూ సాగే ఈ సాంగ్‌లో కావ్య థాపర్ తన క్యూట్ లుక్స్‌తో పాటు, హీటెక్కించే అందాలతో సెగలు రేపేస్తోంది. చాలా గ్రేస్‌ఫుల్‌గా ఈ వీడియోలో కావ్య థాపర్ వేసిన డాన్స్ స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రిలీజైన చాలా కొద్ది టైమ్‌లోనే ఈ సాంగ్ బోలెడన్ని వ్యూస్ సంపాదించుకుంది.

నెట్టింట ఫుల్ వైరల్‌గా మారింది ఈ వీడియో సాంగ్. దీంతో కావ్య థాపర్ మళ్లీ టాలీవుడ్‌లో ఆఫర్లు దక్కించుకునే అవకాశాల్లేకపోలేదు. అలాగే, బాలీవుడ్‌లోనూ అమ్మడిపై ఒకింత దృష్టి పడిందట. సో, ఒకేసారి ఇక్కడా, అక్కడా కావ్య థాపర్ దంచి కొడుతుందేమో చూడాలి మరి.