టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా నిర్మాణ సంస్థల్లో యూవీ క్రియేషన్స్ ఒకటి. ప్రభాస్ స్నేహితులైన వంశీ ప్రమోద్ ఇందులో నిర్మాతలు. రావడమే పెద్ద సెటప్ పెట్టుకుని దిగిన వీరు చేసేవన్నీ పెద్ద సినిమాలుగానే ఉండాలని నియమం పెట్టుకున్నారు. ఆ ప్రకారమే భారీ సినిమాలు చేశారు. అడపాదడపా చిన్న, మీడియమ్ రేంజ్ సినిమాలు కూడ చేశారు. వీరి ట్రాక్ రికార్డ్ చూస్తే చేసిన వాటిలో పెద్ద సినిమాలకంటే చిన్నవే లాభాల్ని తెచ్చి పెట్టాయి. ప్రజెంట్ ఉన్న కోవిడ్ పరిస్థితుల్లో బడా సినిమాలు చేసే స్కోప్ కూడ లేదు. అందుకే తప్పక చిన్న సినిమాలు చేస్తున్నారు.
ఇటీవల వాళ్ళు చేసిన ‘ఏక్ మినీ కథ’ మంచి లాభాల్ని అందించింది. ఈ సినిమా నిర్మాణ వ్యయం మూడు కోట్ల లోపే. కానీ అమెజాన్ పెద్ద మొత్తం చెల్లించి హక్కులు కొనుక్కుంది. ఈ సినిమాతో పెట్టుబడి మీద రెండింతల లాభం చూశారు యూవీ నిర్మాతలు. అందుకే వెంటనే మారుతితో ఇంకో సినిమా ప్లాన్ చేశారు. ఇది కూడ చిన్న బడ్జెట్ చిత్రమే. రెండు నెలల్లో ఫస్ట్ కాపీ రెడీ అయ్యేలా ప్లాన్ చేశారు. ఇందులోనూ సంతోష్ శోభన్ హీరో. సినిమా ఇలా మొదలైందో లేదో ఆహా ఓటీటీ మంచి రేటు ఇచ్చేసి సినిమాను బుక్ చేసుకుందట. ఇక్కడైతే డబ్బులు పెట్టకముందే లాభాలు చూసేశారు. ఈ రెండు సినిమాలతోనే మంచి లాభాల్ని వెనకేసుకున్నారు. అందుకే ఇక మీదట కూడ ఇలాంటి చిన్న సినిమాలను ఎక్కువగా తీయాలని అనుకుంటున్నారట.