AP: ఇకపై వైసీపీ నేతలు ఎవరు రోడ్లపై తిరగలేరు… మాస్ వార్నింగ్ ఇచ్చిన హోం మంత్రి అనిత!

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ నేతలు అందరిని కూడా అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శలు కురిపిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలు అవుతోందని విమర్శలు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు కావడంతో ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి అనిత స్పందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మేము కనుక రెడ్ బుక్ ప్రకారం ముందుకు వెళితే ఇకపై వైసీపీ నేతలు ఎవరు కూడా రోడ్లపై తిరగలేరు అంటూ ఈమె వైసిపి నేతలకు తనదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు.

కూటమిలో అంతర్యుద్ధం అని కామెంట్స్ చేసిన గోరంట్ల మాధవ్ పై .ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే ఇక్కడ కుదరదని ఇది వైసీపీ ప్రభుత్వం కాదని ఎన్డీఏ ప్రభుత్వమని ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మసులుకోవాలి అంటూ అనిత వైకాపా నేతలకు వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఇటీవల పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్ట్ లో భాగంగా సంచలన విషయాలను బయటపెట్టారు తాను స్క్రిప్ట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ ని తిట్టానని వారి డైరెక్షన్ లోనే నేను తిట్టాను అంటూ ఈయన రిమాండ్ రిపోర్టులో వెల్లడించినట్లు తెలిపారు అయితే స్క్రిప్ట్ ఎవరిచ్చిన శిక్ష అనుభవించేది రాజానే కదా అంటూ ఈమె చురకలు అంటించారు.