ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల నుంచి వచ్చిన బ్రేక్ లో తెలుగు బుల్లితెర పై మరో పెద్ద రియాలిటీ షో అయినటువంటి “ఎవరు మీలో కోటీశ్వరులు” షో చేస్తున్నారు. అయితే ఈ షో కూడా ఆల్ మోస్ట్ ముగింపు దశకు చేరుకుంది. మరి ఈ షో లో ఇప్పుడు హిస్టారికల్ ఎపిసోడ్ కి సమయం ఆరంభం అయ్యింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ పై మేకర్స్ టీజ్ చెయ్యడం కూడా స్టార్ట్ చేశారు. ఈ సీసన్ మొట్ట మొదటి కోటి రూపాయల ప్రశ్న అంటూ ఓ రేంజ్ లో చూపిస్తున్నారు.
మరి ఈ మొత్తం గెలుచుకున్నారా లేదా అనేది ఇప్పుడు తెలుస్తోంది. కొత్త గూడెం కి చెందిన 33 ఏళ్ల సబ్ ఇన్స్పెక్టర్ రాజా రవీంద్ర ఈ సీసన్ లో 1 కోటి రూపాయల ప్రశ్న కి సరైన సమాధానం చెప్పి ఈ భారం మొత్తాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించడట. మరి ఈ ఎపిసోడ్ రెండు రోజులు కొనసాగుతుంది అట. ఈరోజు అలాగే రేపు టెలికాస్ట్ అయ్యే ఈ షో రసవత్తరంగా ఉంటుంది అని ఆల్రెడీ అర్ధం అవుతుంది. మరి ఈ కోటి రూపాయల వరకు ఆయన ఎలా వెళ్ళాడో? ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నాడో తెలియాలి అంటే ఈ షో ని జెమినీ ఛానెల్లో వీక్షించాల్సిందే.