వెబ్ సిరీస్‌పై వెల్లువెత్తుతున్న ఆందోళ‌న‌లు.. స్టార్ హీరోయిన్ ఇంటికి హై సెక్యూరిటీ!

థియేటర్లలో విడుదల చేసే సినిమాలకు సెన్సార్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ తో పాటు.. మానవ హక్కుల మనోభావాలు దెబ్బతినేలా ఉంటే వాటిని సినిమా నుండి తొలగిస్తారు. సాధ్యమైనంత వరకు సెన్సార్ చేస్తారు. కానీ లాక్ డౌన్ మహిమతో ప్రేక్షకులతో పాటు డైరెక్టర్లు.. ప్రొడ్యూసర్లు ఓటీటీల బాట పట్టారు. దీంతో ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లపై ఎలాంటి కంట్రోల్ లేకుండా పోతుంది. ఇటీవల ఓటీటీల్లో వచ్చే సిరీస్ లు ఎక్కువగా వివాదస్పదంగా మారుతున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటించి తాండవ్ వెబ్ సిరీస్ హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయంటూ దుమారం రేపుతోంది. దీంతో తాండవ్ వెబ్ సిరీస్ పై వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ వివరణ కోరింది.


తాండవ్ వెబ్ సిరీస్.. పూర్తిగా హిందూ దేవతలను కించపరిచేలా ఉన్నాయంటూ.. ఉత్తర ప్రదేశ్ లో ఈ సినిమా దర్శక, నిర్మాతల పై, అమెజాన్ ఇండియా ఒరిజినల్ కంటెంట్ హెడ్ పై కేసు నమోదు చేశారు. దీంతో ఇకపై ఓటీటీలపై కూడా సెన్సార్ షిప్ ఉండాలనే చట్టం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాండవ్ వెబ్ సిరీస్ కాంట్రవర్సీ నేపథ్యంలో కరీనా కపూర్ ఇంటికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో బాయ్ కాట్ తాండవ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. సెక్స్, హింసను పెంచేలా ఉన్న ఈ వెబ్ సిరీస్ ని నిలిపివేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో కరీనా కుటుంబం కలత చెందుతుంది.

పూర్తి పొలిటికల డ్రామాగా తీసిన ఈ వెబ్ సిరీస్ పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్ గతంలో నటించి సాక్రేడ్ గేమ్స్ వెబ్ సిరీస్ కూడా వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తాండవ్ వెబ్ సిరీస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.