పలు అంశాల్లో జగన్ సర్కార్ కు వరుసగా హైకోర్టులో ఎదురుదెబ్బలు తగులుతోన్న సంగతి తెలిసిందే. సచివాలయం రంగులు మొదలుకుని నిమ్మగడ్డ వ్యవహారం వరకూ ప్రతీది ప్రభుత్వానికి ఓ భంగపాటు. హైకోర్టుతో మొట్టికాయలు వేయించకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. అయితే తాజాగా ఏపీ సర్కార్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. జీవో 2430 పై ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. మీడియాపై ఆంక్షలు విధిస్తూ, ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 2430 రద్దు చేయాలంటే దాఖలైన పిటీషన్ ను హైకోర్టు తప్పుబట్టింది.
ఈ వ్యవహారంలో న్యాపరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని మొదలు పెట్టిన కోర్టు పత్రికా స్వేచ్ఛను హరించేందుకు మీడియా సంస్థలపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు జీవో తీసుకురాలేదని..వాస్తవాలను మాత్రమే చూపించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వ తరుపు న్యాయవాది వాధించడంతో కోర్టు ఏకీభవించింది. ఈ తీర్పుతో వాస్తవాలు దాచి…అవాస్తవాలు ప్రచారం చేసే మీడియా సంస్థలకు పంచ్ పడినట్లు అయింది. ముఖ్యంగా పచ్చ మీడియాకు షాకింగ్ తీర్పు అనే అనాలి. జగన్ సర్కార్ ని ఉద్దేశిస్తూ ఓ రెండు తెలుగు పత్రికలు…కొన్ని న్యూస్ ఛానెల్స్ పనిగట్టుకుని వాస్తవాల్ని దాచి పెట్టి అవాస్తవాల్ని ప్రసారం చేస్తున్నాయని ఏపీ సర్కార్ మండిపడిన సంగతి తెలిసిందే.
ఆ ఛానల్స్…న్యూస్ పేపర్లను దృష్టిలో పెట్టుకునే జగన్ 2430 జీవోను తీసుకొచ్చారు. తాజాగా కోర్టు తీర్పుతో ఈసారి అవాస్తవాలు మానేసి వాస్తవాలు ప్రసారం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అవాస్తవాలు రాస్తే ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందన్నది కూడా కోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియా కామెంట్లపై కూడా హైకోర్టు కన్నేర జేసిన సంగతి తెలిసిందే.హైకోర్టు జడ్జిలపై కొందరు వైకాపా నేతలు కామెంట్లు పెట్టడంతో వాళ్లపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.