ఎన్నాళ్లకెన్నాళ్లకు : జగన్ పై హైకోర్టు పాజిటివ్ వ్యాఖ్యలు ??

cm jagan high court

 గత కొద్దీ నెలలుగా ఏపీ రాష్ట్ర హైకోర్టుకు, ఆ రాష్ట్ర సర్కార్ కు మధ్య దూరం పెరిగిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు కావాలనే తీర్పులను ఇస్తుందని వైసీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. కొంచం అటు ఇటుగా హైకోర్టు నుండి కూడా వైసీపీ సర్కార్ కు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అయితే తాజాగా రాష్ట్ర సర్కార్ విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు గుర్తించాల్సి వుంది.

cm jagan high court

వైఎస్సార్ చేయూత పై హైకోర్టు న్యాయ‌మూర్తి

వైఎస్సార్ చేయూత కింద ల‌బ్ధి పొందేందుకు తాము అన్ని ర‌కాలుగా అర్హులైన‌ప్ప‌టికీ, అధికారుల త‌ప్పిదం వ‌ల్ల ఫ‌లాలు అంద‌లేదంటూ కృష్ణా జిల్లా చంద‌ర్ల‌పాడుకు చెందిన 20 మంది హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ జ‌గ‌న్ స‌ర్కార్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే…”రాష్ట్ర ప్ర‌భుత్వం ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం , ఆర్థిక సాధికార‌త కోసం ఎన్నో మంచి ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. వారి జీవ‌న ప్ర‌మాణాల‌ను , జీవ‌న స్థితిగ‌తుల‌ను మార్చేందుకు తీసుకొచ్చిన ఆ ప‌థ‌కాల అమ‌లు వెనుక ఎంతో ప్ర‌శంస‌నీయ‌మైన ఉద్దేశం ఉంది. అయితే ఇంత మంచి ప‌థ‌కాల ఫ‌లాలు కొంద‌రు అధికారుల వ‌ల్ల అందాల్సిన వారికి అంద‌క‌పోవ‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నారు” అని వ్యాఖ్యానించారు.

అమరావతి గురించి

అదే విధంగా మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారంపై ప్ర‌స్తుతం హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. మూడు రాజ‌ధానుల ఏర్పాటు వెనుక ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు దురుద్దేశాలున్నాయ‌ని న్యాయ‌వాది వాదించ‌డంపై ధ‌ర్మాసనం స్పందిస్తూ “అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని మార్చ‌డం వెనుక దురుద్దేశాలున్నాయ‌ని ఎలా చెబుతారు? ముఖ్య‌మంత్రి ఫ‌లానా హామీ ఇచ్చి ఉల్లంఘించార‌ని చెబుతున్నార‌ని, అది ఎలా దురుద్దేశం అవుతుంది? సీఎం తీరు గురించి చెప్ప‌డం, దురుద్దేశాలు ఆపాదించ‌డం వేర్వేరు. దురుద్దేశాలున్నాయంటే అందుకు నిర్దిష్ట‌మైన వివ‌ర‌ణ‌, కార‌ణాలు తెలియ‌జేయాల్సి ఉంటుంది. ఊరికే దురుద్దేశాలున్నాయ‌ని చెబితే స‌రిపోదు. అలాగే రాజ‌ధాని ఒక చోట‌, హైకోర్టు మ‌రోచోట ఉన్న న‌గ‌రాలు ఎన్నో ఉన్నాయి. అందువ‌ల్ల హైకోర్టును అమ‌రావ‌తిలో కాకుండా మ‌రోచోట ఏర్పాటు చేయ‌డం త‌ప్పెలా అవుతుంది?” అంటూ ప్రశ్నించారు.

వైసీపీ శ్రేణులు మారాల్సిన సమయం

 త‌మ‌కు వ్య‌తిరేక‌మ‌నే భావిస్తున్న ఓ రాజ్యాంగ వ్య‌వ‌స్థ నుంచి వైసీపీ సర్కారు ప్ర‌శంస‌లు రావ‌డం కంటే ఆనందం మ‌రేదైనా ఉందా? ఈ మధ్య వస్తున్నా తీర్పులు వైసీపీ కి అనుకూలంగా వస్తున్నాయి, ‌తమ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేక కామెంట్స్‌, తీర్పులు వ‌చ్చిన‌ప్పుడు సీరియ‌స్‌గా రియాక్ట్ అవుతున్న వైసీపీ శ్రేణులు, ఇదే సంద‌ర్భంలో త‌మ‌కు అనుకూల తీర్పులు వస్తున్నప్పుడు ప్ర‌శంసించాలి క‌దా? ఆ ప‌ని ఎందుకు చేయ‌డం లేదు. . ఒకటి అరా సందర్భాల్లో తప్పితే మినహా న్యాయస్థానాలు అనేవి రాజ్యాంగ బద్ధంగానే నడుస్తాయి. కాబట్టి ఇప్పటికైనా న్యాయస్థానాల విషయంలో వైసీపీ శ్రేణులు సానుకూలంగా వ్యవహరిస్తే ఎవరికీ ఎలాంటి సమస్యలు రావు