హై కోర్ట్ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం తో ఫోన్ ట్యాపింగ్ లో ‘ అసలు దొంగ ‘ బయట పడుతున్నాడు

జగన్‌ను ఆపే దమ్ము టీడీపీకి ఉందా..లేదా ?

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయాల్లో సర్వసాధారణం.గతంలో జగన్ మోహన్ రెడ్డి కూడా టీడీపీ నేతలు తమ ఫోన్స్ ను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. కానీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్రంలో కొత్త రాజకీయ పోకడలకు దారి తీస్తుంది. మొదటగా ఈ విషయంపై ఆంధ్రజ్యోతిలో కథనం రావడం దగ్గర మొదలైన ఈ గొడవ ఇంకా పెరుగుతూనే ఉంది.
Hight court stay on three capitals bill
దీనిపై ప్రధానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాయడం, న్యాయవాది శ్రావణ్ కుమార్ హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ పిటిషన్ పై నిన్న విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ మహేశ్వరీ నేతృత్వంలోనే బెంచ్ ఈ వాదనలు విన్నది. ఈ అంశం పై దాదాపుగా 45 నిమిషాల సేపు వాదనలు జరిగాయి. అయితే ప్రభుత్వం తరుపు వాదనలు వినిపిస్తూ, ఆంధ్రజ్యోతిని కూడా పార్టీగా చేర్చాలని వాదించారు. దీని పై స్పందించిన ధర్మాసనం, ఆ కధనం చదివి వినిపించమని కోరింది. ఆంధ్రజ్యోతి కధనంపై ఫోన్ ట్యాపింగ్ కు విచారణకు ఆదేశిస్తే, మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి అంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, పిటీషనర్ శ్రవణ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆంధ్రజ్యోతి కధనంలో ఏమైనా తప్పు ఉంటే, మీరు తగు చర్యలు తీసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది.

ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద నేరం అని, రాజ్యంగంలో కూడా ఇది ఉందని, ఇద్దరి వ్యక్తుల మధ్య మాట్లాడే విషయం, వినే హక్కు ఎవరికీ లేదని, ఈ హక్కును ఏపీ ప్రభుత్వం కాలరాస్తూ ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక అధికారిని ప్రభుత్వం నియమించింది అంటూ, న్యాయవాది శ్రవణ్ కోర్టుకు తెలిపారు. అతని పెరు చెప్పమని కోర్ట్ అడగగా తాను ఇప్పుడు చెప్పలేనని, దీనిపై పిటిషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అలాగే మొబైల్ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా నోటీసులు జారీ చేసింది. హై కోర్ట్ తీసుకుంటున్న చర్యల వల్ల ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్న అసలు దొంగలేవరో బయటపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.