అటు తిప్పి ఇటు తిప్పి కేసిఆర్ ని ఇరకాటంలో పెట్టిన హైకోర్టు!!

మూడు రాజధానుల వెనుక కేసీఆర్ ఉన్నారట.. ఎంత హాస్యాస్పదం

ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క వాక్చాతుర్యం గురించి అందరికి తెలుసు. వినే వాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారు, వినకపోతే వాళ్ళను ఎలా దూరం పెట్టాలో కూడా బాగా తెలుసు అలాగే విని వ్యతిరేకించే వారిని ఎలా అణచాలో కూడా బాగా తెల్సు. మనుషులను అయితే మాటలతో మాయ చేయవచ్చు కానీ చట్టాన్ని మాత్రం మాటలతో మాయ చేయలేము. ఈ విషయం రాష్ట్ర హై కోర్టు ఇప్పటికే చాలాసార్లు కేసీఆర్ కు కూడా అర్ధమయ్యేటట్టు చాలా సార్లు చెప్పింది. తాజాగా మరోసారి ప్రభుత్వం చేసిన తప్పును ఎత్తి చూపుతూ కేసీఆర్ ప్రభుత్వంను ప్రభుత్వంను ఇరకాటంలో పెట్టింది.

దాదాపు పదేళ్ల క్రితం కేంద్రం తీసుకొచ్చిన ఉచిత నిర్బంధ విద్యాహక్కుచట్టం తెలంగాణ రాష్ట్రంలో అమలు కాకపోవటంపై తెలంగాణ హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. చట్టం వచ్చి పదేళ్ల అవుతున్నా.. ఇప్పటివరకు అమలు కాకపోవటం ఏమిటని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన విచారణలో కౌంటర్ దాఖలు చేస్తామని పలుమార్లు సమయాన్ని తీసుకున్నా.. ఇప్పటికి దాఖలు చేయటం లేదని ప్రశ్నించారు. ఇదే చివరి అవకాశమని.. సెప్టెంబరు నాలుగున జరిగే విచారణ సమయానికి పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. కేంద్రం చేసిన చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు చేయటానికి అవసరమైన ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అందులో 60 శాతం మొత్తాన్ని కేంద్రం నుంచి వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ చట్టానికి సంబంధించి దాఖలైన పది పిటిషన్లకు కలిపి సమగ్ర కౌంటర్ దాఖలు చేస్తామని అందుకు ఎనిమిది వారాల టైం కావాలని కోరారు. అంత సమయం ఇవ్వలేమన్న కోర్టు.. వచ్చే నెల నాలుగు నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కోరారు.

హై కోర్ట్ ప్రశ్నలకు సమాధానమిస్తూ…ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వంపై అదనపు భారం పెరుగుతుందని ప్రభుత్వ అధికారులు తమ వాదనలు వినిపించింది. ఈ వాదనలను హై కోర్ట్ తప్పు పట్టింది. ఖర్చు చేసిన వాటిలో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు, కేవలం 40% ఖర్చును ప్రభుత్వం భరించలేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చట్టం అమలై ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు లబ్దిపొందే వారని, ఇప్పటికే ఈ పథకం 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని తెలిపింది. హై కోర్ట్ తో తిట్లు తినడం ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వానికి అలవాటైంది.