పూర్ణ ప్రేమలో ఫెయిల్ అయిందా.. అందుకే ప్రేమ గురించి ఇలా మాట్లాడుతుందా?

ప్రముఖ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రవిబాబు నిర్మించిన అవును సినిమా ద్వార హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన పూర్ణ ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న పూర్ణ ఇటీవల ఇండస్ట్రీకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా రీ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ సినిమాలలో కీలక పాత్రలలో నటించటమే కాకుండా బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో నటించింది.

ఇక బుల్లితెర విషయానికి వస్తే ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ షో కి జడ్జ్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది. అంతే కాకుండా పండగ వేళల్లో బుల్లితెర మీద నిర్వహించే కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తోంది. అయితే కొంతకాలంగా పూర్ణ ఢీ షో లో కనిపించటం లేదు. కానీ శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ఇంద్రజ గారి స్థానంలో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. అయితే ఇటీవల ఈ షో లో చేసిన ఒక స్కిట్ చుసి పూర్ణ బాగా ఎమోషనల్ అయ్యింది. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో నూకరాజు, శాంతికుమార్,ఆసియా కలిసి చేసిన స్కిట్ చుసి అందరు ఎమోషనల్ అయ్యారు.

నూకరాజు, శాంతికుమార్, ఆసియా కలిసి ఒక విషాద ప్రేమ కథను స్కిట్ గా చేసి చూపించారు. ఈ స్కిట్ ద్వారా ఈ ముగ్గురు అక్కడున్న వారి మనసుని కదిలించారు. ఈ స్కిట్ చూసిన రష్మి కూడా ఎమోషనల్ అయ్యింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరిది కరెక్ట్ అన్న విషయం చెప్పలేం.. అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. ఇక ఈ స్కిట్ చుసి పూర్ణ కూడా బాగా ఎమోషనల్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వైపు న్యాయం ఉందో చెప్పలేము. కానీ ఇలా పరువు హత్యలు చేయడం మాత్రం చాలా తప్పు. ప్రేమించిన వారితో జీవితాంతం కలిసి బతకాలన్నా కూడా అదృష్టం ఉండాలి… కానీ ఆ అదృష్టం అందరికీ దొరకదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే పూర్ణ ప్రేమ గురించి ఇలా అనటంతో ఆమె జీవితంలో కూడా ఏమైనా బ్రేకప్ స్టోరీ ఉందా అంటూ అనుమానపడుతున్నారు.