బాలీవుడ్ హీరోయిన్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది. ఇక ఈమె కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ తో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.అలాగే అప్పుడప్పుడు పలు విషయాలలో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని సైతం ఎదుర్కొంటూ ఉంటుంది. తనపై ఎంత మంది ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసిన చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటుంది దీపికా పదుకొనే. ఈమెకు బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. దీపికా పదుకొనే సినిమాలలో అందం అభినయంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. ఇక పోతే అసలు విషయంలోకి వెళితే..తాజాగా మంగళవారం దీపికా పదుకొనే హైదరాబాదులోని కామినేని ఆసుపత్రిలో చేరింది.
ఈమె ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం హైదరాబాదులో ఉంటుంది. తాజాగా ఈమెకు మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఉన్నట్టుండి హార్ట్ బీట్ పెరిగిపోవడంతో కంగారు పడిపోయిన దీపికా షూటింగ్ ను రద్దు చేసుకొని మరి హుటాహుటిన కామినేని ఆసుపత్రికి వెళ్ళిందట. ఆ కామినేని హాస్పిటల్ లో ప్రథమ చికిత్స అనంతరం ఆమె తాను బస చేసే నోవాటెల్ హోటల్ కి వెళ్లి పోయినట్లు తెలుస్తోంది. నోవాటెల్ హోటల్లో కూడా ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దీపికా పదుకొనే ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన పని లేదు అని వైద్యులు సూచించారు.