Alia Bhatt: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి అలియా భట్ ఒకరు. ప్రముఖ డైరెక్టర్ మహేష్ భట్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆలియా నటనలో తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.. ఇక ఈమె నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి నటన పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆలియా నటుడు రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇక ఈ దంపతులకు రాహా అనే కుమార్తె కూడా జన్మించారు.
ఇక ఈ చిన్నారి కూడా అచ్చం తల్లిలాగే ఎంతో చూడముచ్చటగా ఉంటారు. ఇక తన కుమార్తె ఫోటోలను దాదాపు ఏడాది వరకు బయట ఎక్కడ పెట్టని ఈమె ఇటీవల పెద్ద ఎత్తున తన కుమార్తె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. అయితే ఉన్నఫలంగా తన కుమార్తె కనిపిస్తూ ఉన్న ఫోటోలను ఈమె డిలీట్ చేశారు. ఇలా సోషల్ మీడియాలో తన కుమార్తె ఫోటోలు కనిపించకుండా ఈమె డిలీట్ చేయడంతో అసలు ఎందుకు ఆలియా భట్ తన కుమార్తె ఫోటోలను డిలీట్ చేశారు ఇలా కూతురి ఫోటోలను డిలీట్ చేయడం వెనుక గల కారణం ఏంటి అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.
తన కుమార్తె ప్రైవసీకోసమే ఈమె తన కూతురి ఫోటోలన్నింటినీ కూడా డిలీట్ చేశారు అంటూ కొందరు భావిస్తుండగా మరికొందరు మాత్రం సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడికి సంబంధించి ఆలియా ఈ నిర్ణయం తీసుకుందని రెడిట్‌లో ఒక టాక్ వినిపిస్తోంది. ఫోటోలు తీసేసిన విషయంపై అలియా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలియా నిర్ణయాన్ని కొందరు రెడిట్ యూజర్లు మెచ్చుకున్నారు. పిల్లల రక్షణ కోసం ఆమెకు నచ్చింది చేయొచ్చు అన్నారు.