‎OG Movie Trailer: పవన్ ఓజీ ట్రైలర్ పై రివ్యూ ఇచ్చిన సాయి తేజ్.. వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్ అంటూ!

‎OG Movie Trailer: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. పవన్ ప్రస్తుతం రాజకీయాలు సినిమాలతో ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. ఇకపోతే పవన్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ. ఈపాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు.

‎అయితే తాజాగా విడుదల అయిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది. ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎఫ్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ట్రైలర్ ఇప్పుడు ట్రెండింగ్‌ లోకి వచ్చేసింది. ఇక ఈ ట్రైలర్‌ ను వీక్షించిన హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేం ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయల్దేరింది.
They Call Him OG Trailer - Pawan Kalyan | Emraan Hashmi | Sujeeth | Thaman S | DVV Danayya |

‎ నాతో సహా ప్రతీ అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తి పరిచిన సుజీత్ గారికి థాంక్స్. ట్రైలర్‌ ను అద్భుతంగా కట్ చేశారు. నా ప్రియ మిత్రుడు తమన్ ఇచ్చిన బీజీఎం అయితే నిజంగానే ఫైర్ స్ట్రామ్.. అంటూ పొగడ్తలతో ముంచెత్తారు సాయి దుర్గ తేజ్. నా హీరో, నా గురువు పవన్ కళ్యాణ్ మామయ్య ప్రతీ ఫ్రేమ్‌ లో అద్భుతంగా కనిపించారు.

స్వాగ్, స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్పా ఇంకెవ్వరికీ సాధ్యం కావు అన్నట్టుగా ఉంది. ఓజీ మూవీని మనమంతా కలిసి సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే అంటూ ట్వీట్ చేసారు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.