హీరో రామ్ ని భలే ఇరకాటం లో పెట్టారు.. జగన్ స్కెచ్ మామూలుగా లేదు!

 

వివాదాల్లో కాదు కనీసం పార్టీల్లో హీరో రామ్ ఎక్కువగా కనిపించరు. కానీ ఈ మధ్య ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ విజయవాడ స్వర్ణా హోటల్ అగ్ని ప్రమాదానికి సంబంధించి చేసిన కొన్ని ట్వీట్స్ మాత్రం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
Social media people fires on hero Ram Pothineni
స్వర్ణా హోటల్ ను అద్దెకు తీసుకొని దాన్ని కోవిడ్ సెంటర్ గా మార్చి వైద్యం డాక్టర్ రమేష్ కుమార్ రామ్ కు బాబాయ్ అవుతారు. తన బాబాయ్ ను ఈ కేసులో అనవసరంగా ఇరికిస్తున్నారని భావించిన రామ్ ఈ ఘటనకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసును ఫైర్ నుంచి ఫీజు వైపు మళ్లించి, ఫూల్స్‌ను చేస్తున్నారని కొన్ని డాక్యుమెంట్లు ట్వీట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరో వైపు ఆ కేసులో రమేష్ ఆస్పత్రి డాక్టర్లను టార్గెట్ చేశారని, తప్పు హోటల్‌ది అయితే ఆస్పత్రిని టార్గెట్ చేయడం తగదని, కొంత మంది రాజకీయ నాయకులు ఈ విషయాన్ని కులంకు అంటకడుతున్నారని హీరో రామ్ ట్విట్టర్ ద్వారా తన భావాలను వ్యక్తపరిచారు.

అయితే ఈ వ్యాఖ్యలను ఏపీ పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసును ప్రస్తుతం విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు పర్యవేక్షిస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… క్వారెంటైన్ సెంటర్‌కి కోవిడ్ కేర్ సెంటర్‌కి తేడా ఉందని, బాబాయ్ డాక్టర్‌ రమేష్‌ని కాపాడుకొనేందుకు రామ్ అసత్య ఆరోపణలతో విచారణకు అడ్డు తగులుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి హీరో రామ్ అడ్డంకులు కలిగిస్తే నోటీసులు జారీ చేయాల్సి వస్తుందని సూర్యచంద్ర తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రామ్ ఇంకా తన అభిప్రాయాలను వ్యక్తపరచలేదు. నోటీసులకు భయపడి ఈ కేసుకు దూరంగా ఉంటాడో, లేదా బాబాయ్ కోసం నిలబడుతాడో వేచి చూడాలి. కానీ రామ్ ను అడ్డుకోవడానికి నోటీసుల అస్త్రాన్ని జగన్ ప్రభుత్వం బాగా ఉపయోగించుకుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.