Nithin: ఆ హీరోయిన్ల నుంచి అవి దొంగతనం చేయాలని ఉంది… నితిన్ కామెంట్స్ వైరల్!

Nithin: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నితిన్ గత కొంతకాలంగా అనుకున్న స్థాయిలో సినిమాల ద్వారా సక్సెస్ అందుకోలేకపోతున్నారు. వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్ కి సరైన సక్సెస్ మాత్రం పడలేదు. దీంతో ఈసారి రాబోయే సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఈయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ శ్రీ లీల జంటగా రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 28వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ కి యాంకర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోల ఫోటోలతో పాటు హీరోయిన్స్ ఫోటోలను కూడా చూపించారు.

ఇలా ఈ సెలబ్రిటీల నుంచి మీరు దొంగతనం చేయాల్సి వస్తే కనుక ఏ వస్తువులను దొంగతనం చేస్తారో అంటూ అడిగారు. ఈ ప్రశ్నకు నితిన్ కూడా సరదాగా సమాధానాలు చెప్పారు.ప్రభాస్ నుంచి వ్యక్తిత్వం, విజయ్ దేవరకొండ నుంచి రౌడీ క్యారెక్టర్, బన్నీ నుంచి డ్యాన్స్, మహేశ్ బాబు నుంచి అందం, పవన్ కల్యాణ్‌ నుంచి అన్నీ దొంగిలిస్తానని చెప్పుకొచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ నుంచి డైలాగ్ డెలివరీ, నాని నుంచి ఈగ మూవీ దొంగిలించాలని ఉందంటూ చెప్పారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో హీరోయిన్స్ ఫోటోలను కూడా యాంకర్ చూపించారు. కాజల్ అగర్వాల్ శ్రీ లీల నుంచి కళ్ళను దొంగతనం చేస్తానని తెలిపారు. అలాగే అనుష్క నుంచి హైట్ దొంగలిస్తాను అంటూ నితిన్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.