లాక్ డౌన్ సమయంలో కోవిడ్ బాధితులకు విశేష సేవలు అందించిన హీరోల్లో నిఖిల్ కూడ ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హాస్పిటల్ బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజక్షన్లు, అత్యవసర మందులు దొరక్క ఇబ్బందిపడిన అనేకమంది నిఖిల్ అండ్ టీమ్ సహాయం అందించారు. నిఖిల్ నేరుగా వెళ్లి బాధితులకు మందులు అందించిన సందర్భాలు ఉన్నాయి. కొందరు కోవిడ్ పేషంట్లు, ఇతర ఇబ్బందులతో చికిత్స పొందిన రోగులు హాస్పిటల్ బిల్స్ చెల్లించలేని స్థితిలో ఉంటే వారి బిల్స్ క్లియర్ చేసి డిశ్చార్జ్ అయ్యేలా చూశారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ ట్రీట్మెంట్ కోసం లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. వాటికే కాదు చిన్న చిన్న సర్జరీలకు కూడ లక్షల్లో బిల్స్ వేస్తున్నారు.
దీన్ని గమనించిన నిఖిల్ వారిని నిలదీస్తున్నారు. లోకల్ హాస్పిటళ్లు బేసిక్ ఆపరేషన్ల కోసం కూడ 10 లక్షలు బిల్ వేస్తున్నారు. మేము కొందరు పేషంట్లకు బిల్స్ కట్టడడం జరిగింది. మేము తెలుసుకున్నది ఏమిటంటే కట్టే డబ్బు మొత్తం ఇష్టానుసారంగా బిల్స్ వేస్తున్న హాస్పిటళ్లకు వెళుతున్నాయి. ఇలాంటి హాస్పిటళ్లను ఎవరు కంట్రోల్ చేస్తారు అంటూ నిలదీస్తున్నారు. నిఖిల్ ఆవేదనలో అర్థం ఉంది. కోవిడ్ సాకును అడ్డుపెట్టుకుని చాలా హాస్పిటళ్లు ఇతర పేషంట్లను అడ్మిట్ చేసుకోవట్లేదు. అత్యవసర చికిత్స అవసరం ఉన్నవారి నుండి అత్యధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్న దోపిడీ. ఈ దోపిడీనే నిఖిల్ ప్రశ్నిస్తున్నారు.