సినిమాల్లో రాణించిన వారి నెక్స్ట్ టార్గెట్ ఎక్కువగా రాజకీయాల్లోకే ఉంటుంది. మరికొందరు వ్యాపార వ్యవహారాలు చూసుకుంటారు. కానీ.. సినిమాల్లో సక్సెస్ అయ్యాక కొందరు సన్యాసంలోకి వెళ్లిన నటీనటులు కూడా ఉన్నారు. వారికి సినిమాలతో పని లేదు. ఆధ్యాత్మిక చింతనలోనే ఎక్కువగా గడిపేస్తూ ఊంటారు. అటువంటి నటీనటులు భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్నారు. మఠం, ఆశ్రమాల్లో చేరి పూజలు, బోధలు, భజనలు చేస్తున్నారు. బాలీవుడ్ నుంచే ఎక్కువగా ఈ మార్గంలో వెళ్లారు. వెరెవరో చూద్దాం..
సోఫియా హయత్: హిందీలో పలు సినిమాలు చేసింది. 2014లో నగ్నంగా ఐస్ బకెట్ ఛాలెంజ్ చేయడం ద్వారా సంచలనం రేపింది. 2017లో రొమేనియాకు చెందిన వ్లాడ్ స్టాన్షూ అనే వ్యక్తిని పెళ్లి కూడా చేసుకుంది. కానీ.. ఆ తర్వాత ఉన్నట్లుండి సన్యాసిని అయిపోయింది. దేవుని కృపతోనే తన తొమ్మిది గత జన్మల గురించి తెలిసిందని.. అందుకే తాను ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లినట్టు ప్రకటించింది.
మమతా కులకర్ణి: 90వ దశకంలో బాలీవుడ్ సినిమాల్లో సెక్సీ హీరోయిన్ గా కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపింది. ఈమె అసలు పేరు పద్మావతి. 2013లో విక్కీ గోస్వామి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 2016లో డ్రగ్స్ రాకెట్ ఆరోపణల్లో చిక్కుకుంది. ఆ తర్వాత శ్రీ చైతన్య గగంగిరి నాథ్ దగ్గర శిక్షణ తీసుకుని సన్యాసినిగా మారిపోయింది.
అనూ అగర్వాల్: ఆషికి సినిమా హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంతో పేరు తెచ్చుకుంది. మణిరత్నం దొంగా దొంగ సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్. హాట్ హాట్ ఫొటో షూట్లతో 90ల్లోనే కుర్రాళ్ల గుండెలను హీటెక్కించేసింది. సినిమాల నుంచి విరమించుకున్న అను అగర్వాల్ సన్యాసినిగా మారిపోయింది. 1997లోనే ఉత్తరాఖండ్‌లోని యోగా ఆశ్రమంలో యోగినిగా చేరింది. తాను ఈ ఆశ్రమంలో చేరడం వల్లే నిజమైన ఆనందం, సంతృప్తిని పొందుతున్నాని తెలిపింది.
వినోద్ ఖన్నా: 1970,80 వ దశకంలో బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. ఓషో శిష్యునిగా మారి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోయి ఖ్యాతి గడించారు. స్వామి వినోద భారతిగా పేరు మార్చుకున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లడంతో కుటుంబంతో విబేధాలు వచ్చాయి. దీంతో ఆయన మొదటి భార్య గీతాంజలి విడాకులు తీసుకున్నారు.
బర్ఖా మదన్: 1984 మిస్ ఇండియా ఫైనలిస్ట్ బర్ఖా మదన్. పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించింది. సిక్కింలోని బౌద్ధ మఠాన్ని దర్శించడానికి వెళ్లి అక్కడే బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ సన్యాసిగా మారిపోయారు.