4500 కిలోమీటర్ల రోడ్ ట్రిప్ కు సిద్దమయిన హీరో అజిత్.. వైర‌ల్‌గా మారిన వార్త‌

తమిళ్ సినీ ఇండస్ట్రీలో తన కంటూ ఓ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు హీరో అజిత్. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటివరకు తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ తో.. హీరోయిజానికి, కమర్షియల్ కమ్ కంటెంట్ ఉన్న హీరోగా మారారు. ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసి తనను తాను నిరూపించుకున్నారు. హీరో అజిత్ కు కోలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ లో కూడా స్పెషల్ క్రేజ్ ఉంది. అలాగే ప్రతి హీరోకి, హీరోయిన్ కి సినిమాలపై మక్కువతో పాటు పర్సనల్ లైఫ్ లో ఏదొక స్పెషల్ ఇంట్రస్ట్ ఉంటుంది. వాటిని వాళ్ళ ఫ్రీ టైమ్ లోనూ.. స్ట్రెస్ నుండి విముక్తి పొందాలనుకున్నప్పుడో బయట ప్రపంచానికి తెలుస్తుంటాయి. అయితే హీరో అజిత్ కి కూడా సినిమాలపైనే కాకుండా బైకులు, కారులపై ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో కూడా ప్రొఫెషనల్ రేసింగ్ ఈవెంట్స్ లో అజిత్ పార్టిసిపేట్ చేసేవారు. ఇప్పుడు ఈ స్టార్ హీరో ఏకంగా 4500 కిలోమీటర్ల భారీ సోలో బైక్ ట్రిప్ కి సిద్దమయ్యారు.


లేటెస్ట్ వార్తల ప్రకారం అజిత్ త్వరలోనే తన స్పోర్ట్స్ బైక్ పై వారణాసి నుండి అందానికి ప్రతీకగా నిలిచే ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం వరకు వెళ్తారట. ఈ నెల చివర్లో అజిత్ తిరిగి చెన్నైకి రానున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం అజిత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వాలిమై సినిమా టీమ్ లో చేరాలనుకుంటున్నారని.. ఫైనల్ షెడ్యూల్ కోసం మొరాకో కు వెళ్తారని ఆయన సన్నిహిత వర్గాలతో పాటు ఫిల్మ్ టీమ్ తెలిపింది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వాలిమై సినిమాలో అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ హుమా ఖురేషి హీరోయిన్ గా.. టాలీవుడ్ హీరో కార్తికేయ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని ఈహెచ్ వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. కమర్షియల్ అంశాలున్న ఈ సినిమాని బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ నిర్మిస్తున్నారు.