మొన్న అజిత్‌, నేడు మ‌రో హీరో.. రిస్కీ స్టంట్స్‌తో గాయ‌ప‌డుతున్న క‌థానాయ‌కులు

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌రిస్థితులు చాలా మారాయి. ఒక‌ప్పుడు హీరోలు రిస్కీ స్టంట్స్ చేసేందుకు అస్స‌లు ఆస‌క్తి చూపేవారు కాదు. కాని ఇప్పుడ‌లా కాదు. కొంద‌రు హీరోలు పాత్ర ప్రియారిటీని బ‌ట్టి డూప్స్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. కొద్ది రోజుల క్రితం త‌మిళ స్టార్ హీరో అజిత్ షూటింగ్‌లో గాయ‌ప‌డి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న విష‌యం తెలిసిందే. బైక్‌పై చేజింగ్ చేస్తున్న స‌మ‌యంలో అజిత్ గాయ‌ప‌డ‌గా, వెంట‌నే అతనిని ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందించారు. ఇప్పుడు ఆయ‌న కోలుకున్న‌ట్టు తెలుస్తుంది.

తాజాగా త‌మిళ స్టార్ హీరో ఆర్య తీవ్రంగా గాయపడ్డారు. విశాల్‌తో క‌లిసి ఎనిమీ చేస్తున్న ఆర్య యాక్ష‌న్ సీన్ చేస్తుండగా, గాయ‌ప‌డ్డాడు. డూప్ లేకుండా ఈ స్టంట్ చేయ‌డంతో అత‌నికి ప్ర‌మాదం జ‌రిగింద‌ని అంటున్నారు. అయితే ఆర్య‌కు ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే చిత్ర యూనిట్ స‌మీపంలోని ఆసుప‌త్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. కొద్ది సేప‌టి త‌ర్వాత తేరుకున్న ఆర్య తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టి స‌న్నివేశాల‌లో పాల్గొన్నారట‌. ఆర్య‌కు వ‌ర్క్‌పై ఉన్న‌డెడికేష‌న్‌ని చూసి చిత్ర బృందం అవాక్కైన‌ట్టు తెలుస్తుంది.

ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఎనిమీ’ సినిమా తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో విశాల్‌, ఆర్య క‌లిసి న‌టిస్తున్నారు. ఇది విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్య‌కు 32వ చిత్రం. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమాలో నటించిన మృణాళిని హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో బాలా దర్శకత్వంలో వచ్చిన ‘వాడు వీడు’ సినిమాలో విశాల్, ఆర్య కలిసి నటించారు. ఇందులో పల్లెటూరి మొరటోళ్లుగా నటించిన వీరు ఇప్పుడు ఎనిమీ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు రానుండడం ఆసక్తిని పెంచుతుంది.