పల్లెటూరి వేషంలో అదరగొట్టిన హెబ్బా పటేల్!

Hebbah Patel

హెబ్బా పటేల్, ఈ పేరు చెబితే కుర్రకారు గుండెల్లో తెలియని అలజడి. ఈ కాలం కుర్రాళ్లకు నచ్చే అన్ని సొగసులు వున్న హీరోయిన్ హెబ్బాహ్ పటేల్.

Hebbah Patel

తెలుగులో తన రెండవ చిత్రం కుమారి 21 F . సుకుమార్ రైటింగ్స్ నుండి వచ్చిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసుకుంది. హెబ్బాహ్ పటేల్ అంటే కుర్రకారు మనసుల్లో మోజు, నిర్మాతల్లో క్రేజు తీసుకొచ్చిన సినిమా అది. దాని తర్వాత వచ్చిన “ఎక్కడికి పోతావు చిన్నదాన” సినిమా కూడా హిట్ అవ్వడంతో హెబ్బా క్రేజు అమాంతం పెరిగిపోయింది.

తర్వాత కాలంలో తన స్క్రిప్ట్ సెలక్షన్ వల్లనో లేకపోతే దర్శకుల లోపం వలనో సరైన హిట్ పడలేదు హెబ్బా పటేల్ కు. తెలుగులో చివరగా భీష్మ సినిమాలో ఒక అతిధి పాత్రలో కనిపించింది. హెబ్బా పటేల్ రాజ్ తరుణ్ తో కలిసి నటించిన “ఒరేయ్ బుజ్జిగా” సినిమా మీదనే తన ఆశలన్నీ పెట్టుకుంది. అయితే ఈ సినిమాకు కోవిద్ వలన థియేటర్ రిలీజ్ అనుమానంగానే వుంది. ఓటిటి ల నుండి ఈ సినిమాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి అని వినిపిస్తుంది.

తన సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుండడంతో సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది హెబ్బా. అందులో భాగంగానే పొలాల మధ్య కూర్చున్న ఫోటో ఒకటి షేర్ చేసింది. అచ్చమైన పల్లెటూరు పిల్లలాగా పొలాల మధ్య చీర కట్టుతో అదరగొట్టింది హెబ్బా.