నితిన్ సినిమా అయినా హెబ్బా పటేల్ కి సక్సస్ ఇస్తుందా ..?

నితిన్ సినిమాలలో నటించిన చాలా మంది హీరోయిన్స్ మంచి సక్సస్ ట్రాక్ లో ఉంటున్నారు. వరసగా క్రేజీ ఆఫర్ అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్నారు. గత ఏడాది భీష్మ సినిమాతో సక్సస్ అందుకున్న నితిన్ ఈ ఏడాది వరసగా సినిమాలతో ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. నితిన్ నటించిన అ..ఆ తో పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో బాగానే నెట్టుకొచ్చింది. నిత్యా మీనన్ కూడా నితిన్ తో నటించిన సినిమాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం నితిన్ నటించిన చెక్ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ సినిమా ద్వారా తమ లక్ ని చెక్ చెసుకోబోతున్నారు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్.

అలాగే రంగ్ దే సినిమా తో కూడా కీర్తి సురేష్ హిట్ అందుకుంటానని చాలా నమ్మకంగా ఉంది. కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఓటీటీలో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ రెండు సినిమాలు కీర్తి సురేష్ కి షాకే ఇచ్చాయి. దాంతో ఇప్పుడు నితిన్ తో నటించిన రంగ్ దే సినిమా మీద భారీగా అంచనాలు పెట్టుకుంది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చ్ 26 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. రీసెంట్ గా కాస్త బ్యాలెన్స్ టాకీపార్ట్ ఉండగా చిత్ర యూనిట్ కంప్లీట్ చేశారు.

ప్రస్తుతం రంగ్ దే సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటోంది. అయితే ఇదే సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్న హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ఈ సినిమా మీద చాలా నమ్మకాలు.. ఆశలు పెట్టుకుంది. రీసెంట్ గా ఒరేయ్ బిజ్జిగా అన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హెబ్బా పటేల్ ఒకే అనిపించుకుంది. సినిమా హిట్ అవడం తో మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. అలాగే ఐటెం సాంగ్స్ కూడా ఒప్పుకుంటోంది. రంగ్ దే గనక హిట్ అయితే మళ్ళీ టాలీవుడ్ లో హెబ్బా పటేల్ గేర్ మార్చే అవకాశం ఉంది. చూడాలి మరి నితిన్ రంగ్ దే తో ఈ అమ్మడు ఎలాంటి సక్సస్ అందుకుంటుందో. ఓదెల రైల్వే స్టేషన్ అన్న సినిమా తప్ప హెబ్బా చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు.