ఇంతలా మారిపోయిది.. పార్వతిగా హెబ్బా పటేల్ పిక్స్ వైరల్

Hebah Patel stills from Odela railway Station

హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఎప్పుడూ బయట తిరుగుతూ, వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హెబ్బా పటేల్ ఎప్పుడూ కూడా ముంబైలోనే ఉంటుంది. షూటింగ్‌లు ఉన్న సమయంలోనే ఇక్కడకు వస్తుంది.. మళ్లీ అక్కడికే చెక్కేస్తుంది. అలా హెబ్బా పటేల్ ప్రస్తుతం ఓదెల రైల్వేస్టేషన్ సినిమాలో నటిస్తోంది.

Hebah Patel stills from Odela railway Station
Hebah Patel stills from Odela railway Station

అలా హెబ్బా పటేల్ ఓ సినిమా ఒప్పుకుందంటే.. అందులో తన పాత్ర భిన్నంగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకులకు ఉంటుంది. కుమారి 21 ఎఫ్, ఎక్కడికి పోతావు చిన్నివాడ అనే సినిమాల్లో హెబ్బా పటేల్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే హెబ్బా పటేల్‌కు మళ్లీ ఆ స్థాయి హిట్ మాత్రం దక్కలేదు. అందుకే ఈ సారి హెబ్బా పటేల్ ప్రయోగాత్మక పాత్రకు ఓకే చెప్పింది. మొదటిసారిగా డీ గ్లామర్ రోల్‌ను పోషిస్తోంది.

క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో పార్వతి అనే పల్లెటూరి పిల్లగా హెబ్బా పటేల్ నటిస్తోంది. ఆ మధ్య వదిలిన స్టిల్స్ ఓ రేంజ్‌లో క్లిక్ అయ్యాయి. ఏంటి హెబ్బా పటేల్ ఇలా మారిపోయిందా? అనేంతలా అందరినీ షాక్‌కు గురి చేసింది. తాజాగా హెబ్బా పటేల్ కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసింది. అవి ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. హెబ్బా పటేల్ చివరగా ఓరేయ్ బుజ్జిగా చిత్రంతో పలకరించింది.