కాంచన జీవితం నాశనం అవటానికి అతనే కారణమా!

కాంచన గారు ప్రకాశం జిల్లా కళావతి గ్రామంలో 1939లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. కాంచన చిన్నతనంలోనే భరతనాట్యం, సంగీతం నేర్చుకున్నారు. ఉద్యోగం చేసే తన తండ్రి వ్యాపార రంగంలోకి దిగగా అన్ని నష్టాలే వచ్చాయి. చివరకు సొంత ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితుల్లో చదువు మానేసి ఎయిర్ హోస్టరుగా ఉద్యోగంలో చేరారు. ఈమె అసలు పేరు వసుంధర దేవి.

ఒకరోజు విమానంలో ప్రయాణిస్తున్న తమిళ దర్శకనిర్మాత శ్రీధర్ ఈమెను చూసి మీరు సినిమాలలో నటిస్తారా అంటూ 1963 లో సినిమాలో అవకాశం ఇచ్చారు. 1960 నుంచి 1970 మధ్యలో దాదాపు 150 పైగా సినిమాలలో నటించారు. ఈమె తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలలో నటించడం జరిగింది. ఒక దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్ గా పేరుపొంది ఆమె 1980 వరకు హీరోయిన్ గా కొనసాగింది. తమిళ హీరో ముత్తురామంతో దాదాపు 19 సినిమాలలో నటించింది. దాదాపు అప్పటి అగ్ర హీరోల అందరితో ఈమె నటించింది. ఇక తెలుగులో పవిత్ర బంధం, మంచివాడు, ఇంకా కే విశ్వనాథ్ నిర్మించిన ఆత్మగౌరవం సినిమాలో నటించింది.

ఇక కృష్ణంరాజుతో నీతి నిజాయితీ, పరివర్తన, ధర్మదాత, శ్రీ కృష్ణావతారం సినిమాలలో నటించింది. ఇక 1980 నుంచి ఆమె సినిమాలలో నటించడం దాదాపుగా తగ్గించింది. ఆ తర్వాత వచ్చిన ఆనంద భైరవి, శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, జానీ, మౌనరాగం వంటి సినిమాలలో ముఖ్య పాత్రను పోషించింది. పెళ్లిచూపులు ఇంకా ఇటీవలే వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకు నాయనమ్మగా కూడా చేసింది. ఇలా తన తండ్రి పోగొట్టిన ఆస్తి కంటే ఇంకా ఎక్కువ ఆస్తి సినిమాలలో నటించి సంపాదించింది కాంచన. అయితే కూతురికి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం భర్త పిల్లలకే వెళుతుంది. తమ జీవనానికి ఆధారం ఉండదు అని భావించిన తండ్రి కూతురికి మాయమాటలు చెప్పి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నాడు. కనీసం కూతురికి పెళ్లి కూడా చేయలేదు.

కన్నవాళ్లే తనను ఒక డబ్బు సంపాదించే మిషన్ గా చూడడం ఆమె జీవించుకోలేకపోయింది. ఒక గుడిలో ఉంటూ ప్రసాదం తింటూ దైవచింతన చేసుకుంటూ దేవుడి ఆవరణలోనే జీవితం గడప సాగింది. తన ఆస్తుల విషయంలో కోర్టులో కేసు వేసిన కాంచనకు గెలుపు తన వైపే నిలబడింది వచ్చిన ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఆ ఏడుకొండల స్వామికి రాసి ఇచ్చి గుడిలో ఒక సాధారణ జీవన విధానంను కొనసాగిస్తుంది కాంచన. కేవలం ఒక ఆడపిల్లగా ఎంతో బరువు బాధితులు మీద వేసుకొని ఎన్నో కష్టాలు దాటి ధైర్యంగా నిలబడడం విశేషం అనే చెప్పాలి. ఇది కాంచన గారి జీవితంలో జరిగిన విఘాత సంఘటనలు.