Mohan Babu: వామ్మో…ఇంద్ర భవనాని తలపిస్తున్న మంచు మోహన్ బాబు ఇల్లు!

Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా, ఎన్నో సినిమాలలో హీరో,విలన్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్ బాబు సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించి 100 చిత్రాలకు పైగా నిర్మాతగా వ్యవహరించారు. ఈయన సినిమారంగంలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన శైలిలో రాణించారు. ఎక్కడో చిత్తూరు జిల్లాలోని మోదుగుళపాలెంలో మోహన్ బాబు జన్మించారు. స్వర్గం నరకం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఇలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించిన మోహన్ బాబు ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి విష్ణు లక్ష్మీప్రసన్న మనోజ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తనకు సంబంధించిన విషయాలన్నింటినీ తన ఛానల్ ద్వారా వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే లక్ష్మీప్రసన్న తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన హోమ్ టూర్ చేసి తన ఇంటిని అభిమానులకు చూపించారు. తాజాగా తన తండ్రి మోహన్ బాబు ఇంటిని కూడా లక్ష్మీ ప్రసన్న హోమ్ టూర్ చేశారు. ఈ క్రమంలోనే ఈ హోమ్ టూర్ ప్రోమోను విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది.ఈ క్రమంలోని ఈ హోమ్ టూర్ తన తండ్రి హోమ్ టూర్ అని తన తండ్రి ఆరవ ఇల్లని ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న తెలియజేశారు. ఇక ఈ వీడియోలో కిచెన్, హోమ్ థియేటర్, ఆఫీస్ అన్ని చూపించింది. ఈ ప్రోమో చూసిన అభిమానులు మోహన్ బాబు ఇల్లు ఇంద్రభవనంలా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.