పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … జనసేన పార్టీతో ప్రజల ముందుకి వచ్చి గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ కూడా ప్రజల కోసం అప్పుడప్పుడు కొన్ని ర్యాలీలు చేస్తూ వస్తున్నారు. అయితే , ఈ మద్యే పవన్ కళ్యాణ్ లో చాలా మార్పు వచ్చింది. లోకం మారాలి అంటే మొదట మనం మారాలి అని అనుకున్నాడేమో కానీ .. నేను మారాను మీరు కూడా మారండి అని జనాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు జనసేన అధినేత ,కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవం అయిన జేనసేనాని అలాగే మారాడు అంటూ.. పొలిటికల్ సెటైర్లు ఫుల్లుగా వినిపిస్తున్నాయి.
మామూలుగా మొన్నటి దాకా ఎన్నో కామెంట్స్ వచ్చేవి , తను పెట్టింది పార్టీ కాదు.. జస్ట్ ప్రచారం చేసే ఏజెన్సీ అన్నారు కదా. ఎవరు ఏమన్నా తలూపుతారు, ఒక్కోసారి అడ్డంగా కూడా తలాడిస్తారు అంటూ, పవన్ కల్యాణ్ ని పొలిటికల్ గా చిన్న పిల్లాడిని చూసినట్లు చూశారు. పుస్తకాల్లో చదివిన ఎమోషన్ అంతా, స్పీచుల్లో దంచుతారు తప్ప.. పస లేని లీడర్ అంటూ కామెంట్లు చేశారు కదా. ఇప్పుడు వాటన్నీటికీ జనసేనాని ఆన్సర్ ఇస్తున్నారు.
కలల్లో బతికే పొలిటీషియన్ నుంచి అసలు సిసలు రాజకీయనాయకుడిలా కనిపిస్తున్నారని, రియాల్టీలోకి ఇప్పుడిప్పుడే వస్తున్నారని.. పొలిటికల్ అనలిస్టులు జనసేనాని పవన్ కల్యాణ్ మార్పుని అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం జనంలోకి బానే వెళ్తున్నారు. వెళ్లిన టైంలో కూడా మాటల్లో చాలా మార్పు వచ్చింది. రియాల్టీని బేస్ చేసుకుని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తాను అని వచ్చిన పవన్ కల్యాణ్.. ముందు జనాల్నే ప్రశ్నించాలి.. అసలు ప్రాబ్లమ్ ఇక్కడే ఉంది అని రియలైజ్ అయినట్లున్నారు. అందుకే.. జనాల్నే ముందుగా ప్రశ్నిస్తున్నారు పవన్ కల్యాణ్. భాగస్వామ్య పార్టీల్ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. వన్ మ్యాన్ షో కి ట్రై చేస్తున్నారు. నిగ్గదీసే విషయంలో ఎవరినైనా నిలదీస్తా అన్నట్లు ముందుకెళ్తున్నారు. ఇంతకు ముందు సోషల్ మీడియా ద్వారా ఉద్యమం చేసే వారు.. ఇప్పుడు జనంలోకి వెళ్లడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.